Telugu Global
Telangana

ఉద్యోగులకు కేసీఆర్‌ సర్కార్ గుడ్‌ న్యూస్

ఉద్యోగులకు, పింఛనర్లకు డీఏ పెంపు విషయాన్ని ఆర్థిక మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

ఉద్యోగులకు కేసీఆర్‌ సర్కార్ గుడ్‌ న్యూస్
X

ఉద్యోగులు, పింఛన్‌దారులకు కేసీఆర్‌ ప్రభుత్వం గుడ్‌ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు ఒక డీఏను ప్రకటించింది. 2.73 శాతం డీఏను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2021 జూలై నుంచి 2022 డిసెంబర్‌ వరకు డీఏ బకాయిలను 8 విడతల్లో జీపీఎఫ్‌లో జమ చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటి నుంచి పెరిగిన డీఏను నెలనెల చెల్లిస్తారు.

ఉద్యోగులకు, పింఛనర్లకు డీఏ పెంపు విషయాన్ని ఆర్థిక మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఉద్యోగులు, పింఛనర్ల డీఏను 17.29 శాతం నుంచి 20.02 శాతానికి పెంచినట్టు చెప్పారు. డీఏ పెంపుతో 4.4 లక్షల మంది ఉద్యోగులకు, 2.88 లక్షల మంది పింఛనర్లకు లబ్ది చేకూరుతుంది.

First Published:  24 Jan 2023 12:40 AM IST
Next Story