Telugu Global
Telangana

హైద‌రాబాద్‌లో కొత్త‌గా 40 పోలీస్ స్టేష‌న్ల ఏర్పాటుకు ప్ర‌భుత్వం ఆదేశాలు

వీటితో పాటు ప్ర‌తి పోలీస్ స్టేష‌న్‌లో సైబ‌ర్ క్రైమ్‌, నార్కోటిక్ వింగ్ ఏర్పాటు చేయ‌నున్నారు. అలాగే కొత్త‌గా రెండు టాస్క్‌ఫోర్స్ జోన్లు ఏర్పాటు కానున్నాయి.

హైద‌రాబాద్‌లో కొత్త‌గా 40 పోలీస్ స్టేష‌న్ల ఏర్పాటుకు ప్ర‌భుత్వం ఆదేశాలు
X

హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో పోలీసు వ్య‌వ‌స్థ బ‌లోపేతానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే జంట న‌గ‌రాలైన హైద‌రాబాద్‌, సికింద్రాబాద్‌ల‌లో 40 కొత్త పోలీస్ స్టేష‌న్ల ఏర్పాటుకు ప్ర‌భుత్వం జీవో జారీ చేసింది. దీని ద్వారా హైద‌రాబాద్‌లో 12 ఏసీపీ డివిజ‌న్లు, సైబ‌రాబాద్‌లో 3 డీసీపీ జోన్లు ఏర్పాటు కానున్నాయి.

కొత్త‌గా ఆరుగురు డీసీపీల‌ను నియ‌మించ‌నున్న‌ట్టు, ప్ర‌తి జోన్‌కూ ఒక మ‌హిళా పోలీస్ స్టేష‌న్ ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు ఉత్త‌ర్వుల్లో ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. కొత్త‌గా ఏర్పాటయ్యే స్టేష‌న్ల‌లో 11 లా అండ్ ఆర్డ‌ర్‌, 13 ట్రాఫిక్ పోలీస్ స్టేష‌న్లు ఉండ‌టం గ‌మ‌నార్హం.

వీటితో పాటు ప్ర‌తి పోలీస్ స్టేష‌న్‌లో సైబ‌ర్ క్రైమ్‌, నార్కోటిక్ వింగ్ ఏర్పాటు చేయ‌నున్నారు. అలాగే కొత్త‌గా రెండు టాస్క్‌ఫోర్స్ జోన్లు ఏర్పాటు కానున్నాయి. సైబ‌రాబాద్‌లో మేడ్చ‌ల్‌, రాజేంద్ర‌నగ‌ర్, రాచ‌కొండ‌లో జోన్లు ఏర్పాటు చేయ‌నున్నారు. హైద‌రాబాద్‌లో బండ్ల‌గూడ‌, వారాసిగూడ‌, సెక్ర‌టేరియ‌ట్‌, దోమ‌ల‌గూడ‌, ఐఎస్ స‌ద‌న్‌, మాస‌బ్ ట్యాంక్‌, గుడి మ‌ల్కాపూర్‌, మ‌ధురాన‌గ‌ర్‌, ఫిలింన‌గ‌ర్‌, బోర‌బండ‌లో కొత్త పోలీస్ స్టేష‌న్లు ఏర్పాటు చేయ‌నున్నారు. సైబ‌రాబాద్‌లో సూరారం, అల్లాపూర్‌, మోకిల్లా, కొల్లూరు, జినోమ్ వ్యాలీ పోలీస్ స్టేష‌న్లు కొత్త‌గా ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు ప్ర‌భుత్వం ఆ ఉత్త‌ర్వుల్లో తెలిపింది.

First Published:  7 May 2023 1:57 AM GMT
Next Story