ఓటమిపై కేసీఆర్ ఫస్ట్ రియాక్షన్.. ఏమన్నారంటే..!
కొత్త ప్రభుత్వానికి సహకరిద్దామని నేతలతో చెప్పారు. ఏం జరుగుతుందో వేచి చూద్దామన్నారు. త్వరలోనే తెలంగాణ భవన్‌లో పార్టీ సమావేశం ఉంటుందని నేతలకు చెప్పారు.
BY Telugu Global4 Dec 2023 10:30 PM IST
X
Telugu Global Updated On: 5 Dec 2023 9:10 AM IST
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపై ఫస్ట్ టైం స్పందించారు కేసీఆర్. గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో గెలిచిన ఎమ్మెల్యేలు, పలువురు మాజీ మంత్రులు, పార్టీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ భవిష్యత్ కార్యాచరణపై నేతలతో చర్చించారు. ఎన్నికల్లో గెలిచినవారికి అభినందనలు తెలిపారు.
ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిద్దామని నేతలకు సూచించారు కేసీఆర్. రాజ్యాంగబద్ధంగా జనవరి 16 వరకు ప్రభుత్వం కొనసాగే అవకాశం ఉందని, కానీ ప్రజలు ఇచ్చిన తీర్పుతో హుందాగా తప్పుకున్నామన్నారు.
కొత్త ప్రభుత్వానికి సహకరిద్దామని నేతలతో చెప్పారు. ఏం జరుగుతుందో వేచి చూద్దామన్నారు. త్వరలోనే తెలంగాణ భవన్‌లో పార్టీ సమావేశం ఉంటుందని నేతలకు చెప్పారు. ఎన్నికల ఫలితాలపై సమీక్షించి లెజిస్లేటివ్ పార్టీ నేతను ఎన్నుకుందామని అన్నారు.
Next Story