Telugu Global
Telangana

చిలిపి రాజకీయ వికృత క్రీడ

కేసీఆర్ ఒక వ్యక్తి కాదని, ఒక సంస్థ అని చెప్పారాయ. శూన్యంలోనుంచి సునామీ సృష్టించానన్నారు. ఒక పార్టీ స్థాపించి, ఆ పార్టీని ఒక సుడిగాలిగా ఉద్యమరూపంలోకి మార్చి అనుకున్న లక్ష్యాన్ని సాధించానన్నారు కేసీఆర్.

చిలిపి రాజకీయ వికృత క్రీడ
X

తెలంగాణలో చిలిపి రాజకీయ వికృత క్రీడ జరుగుతోందని అన్నారు కేసీఆర్. ఈ రాజకీయ క్రీడకు కాంగ్రెస్సే కారణం అని అన్నారు. రేవంత్, రేవంత్ వెనకున్న ముఠా దీనికి మద్దతిస్తోందని చెప్పారు. అజ్ఞాన అహంకార పూరిత పద్ధతిలో వారు వ్యవహరిస్తున్నారన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చెరిపే ప్రయత్నం చేస్తున్నారని, అది సాధ్యం కాదని చెప్పారు. ప్రజలు మోసపోయి కాంగ్రెస్ ని గెలిపించారని కేసీఆర్.

కేసీఆర్ ఒక వ్యక్తి కాదని, ఒక సంస్థ అని చెప్పారాయ. శూన్యంలోనుంచి సునామీ సృష్టించానన్నారు. ఒక పార్టీ స్థాపించి, ఆ పార్టీని ఒక సుడిగాలిగా ఉద్యమరూపంలోకి మార్చి అనుకున్న లక్ష్యాన్ని సాధించానన్నారు కేసీఆర్. ఆ తర్వాత పదేళ్లు, జాతి, మతం కులం అనే వివక్ష లేకుండా పాలన చేశానన్నారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో తాను ఆంధ్ర ప్రాంతానికి వ్యతిరేకం అనే ప్రచారం జరిగిందని, కానీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆంధ్ర ప్రాంతం వారెవరికీ తెలంగాణలో సమస్యలు రాలేదన్నారు. గతంలో తప్పులు జరగలేదని, కానీ తప్పులు జరిగినట్టు అభూత కల్పనలు చేసి, మీడియా ద్వారా ఊదరగొడుతున్నారని మండిపడ్డారు కేసీఆర్.

కొన్ని మీడియా ఛానల్స్‌, యూట్యూబ్ ఛానెల్స్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కేసీఆర్. కొన్ని బాకా, కాకా ఛానెల్స్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అన్నారాయన. కేసీఆర్ ఉన్నప్పుడు మద్యం అమ్మకాలు పెరిగితే తాగుబోతుల రాష్ట్రంగా రాష్ట్రాన్ని మారుస్తున్నారని అనేవారని, ఇప్పుడు మద్యం అమ్మకాలు పెరిగితే ఎండ తాపం వల్ల పెరిగాయని అంటున్నారని.. ఇదెక్కడి వివక్ష అని ప్రశ్నించారు. కరెంటు కొనుగోళ్లపై కూడా తప్పుడు ప్రచారం జరిగిందన్నారు. అలాంటి ప్రచారం తనకి బాధ కలిగించిందని చెప్పారు కేసీఆర్.

ప్రపంచంలో అత్యధిక ధనికదేశం అమెరికా అని, అత్యధిక అప్పులున్న దేశం కూడా అదేనని అన్నారు కేసీఆర్. ప్రైవేట్ కుటుంబానికి ఉండే అప్పులు వేరు, ప్రభుత్వానికి ఉండే అప్పులు వేరు అని వివరించారు. తెచ్చిన అప్పుల్ని ఎంతవరకు మనం సద్వినియోగం చేసుకున్నామనేదే ముఖ్యం అని అన్నారు. కానీ బట్టకాల్చి మీద వేసినట్టు కాంగ్రెస్ తమపై ఆరోపణలు చేస్తోందన్నారు కేసీఆర్.

First Published:  23 April 2024 8:20 PM IST
Next Story