కేసీఆర్ రెండో విడత ప్రచార షెడ్యూల్ విడుదల..
13వతేదీ అశ్వారావు పేట, బూర్గంపాడు, నర్సంపేటలో సభలు ఉంటాయి. 28వ తేదీన వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలతోపాటు, గజ్వేల్ లో కూడా సభ ఉంటుంది. ఇక 25న హైదరాబాద్ లో భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ ప్రణాళికలు సిద్ధం చేసింది.
సీఎం కేసీఆర్ తొలివిడత ప్రచారం ఈనెల 9తో ముగుస్తుంది. ఆ తర్వాత మూడు రోజుల గ్యాప్ తో మలి విడత ప్రచారానికి ఆయన సమాయత్తమవుతారు. ఈమేరకు రెండో విడత ప్రచార జాబితా కూడా పార్టీ సిద్ధం చేసింది. రెండో విడతలో ఆయన 54 నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటారు.
రెండో విడత ఇలా..
నవంబర్ 13 నుంచి 28 వరకు
16రోజుల షెడ్యూల్
54 నియోజకవర్గాల్లో సభలు
ఈనెల 28న గజ్వేల్ లో చివరి సభ
తొలి విడత అక్టోబర్ 15న హుస్నాబాద్ సభతో కేసీఆర్ తొలి విడత ప్రచారం మొదలైంది. ఆ తర్వాత జనగామ, భువనగిరి, సిరిసిల్ల, సిద్ధిపేట.. ఇలా వరుసగా ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహిస్తూ ముందుకెళ్లారు. మధ్యలో రాజశ్యామల యాగం కూడా విజయవంతంగా పూర్తి చేశారు. శనివారం కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలకు పూజలు నిర్వహించారు, వాటిపై సంతకాలు చేశారు. ఈనెల 9న కేసీఆర్.. గజ్వేల్, కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేస్తారు. నామినేషన్లు వేసే రోజున ఆ రెండు నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటారు. అక్కడితో తొలి విడత షెడ్యూల్ పూర్తవుతుంది.
మూడు రోజుల గ్యాప్ లో మలి విడత షెడ్యూల్ మొదలు పెడతారు కేసీఆర్. 13వతేదీ అశ్వారావు పేట, బూర్గంపాడు, నర్సంపేటలో సభలు ఉంటాయి. 28వ తేదీన వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలతోపాటు, గజ్వేల్ లో కూడా సభ ఉంటుంది. ఇక 25న హైదరాబాద్ లో భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ ప్రణాళికలు సిద్ధం చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలోని 24 నియోజకవర్గాలకు కలిపి ఇక్కడ ఒకటే మీటింగ్ ఏర్పాటు చేశారు.