యాదగిరిగుట్టను కేసీఆర్ గొప్పగా కట్టారు : మండలి ఛైర్మన్ గుత్తా
కేసీఆర్ దూరదృష్టితో, గుడులపై అభిలాషతో యాదగిరిగుట్టను గొప్పగా కట్టారని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రశంసించారు.
BY Vamshi Kotas18 March 2025 10:00 PM IST

X
Vamshi Kotas Updated On: 18 March 2025 10:00 PM IST
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో, గుడులపై ఆయనకున్న అభిలాషతో ఎవరూ ఊహించని విధంగా యాదగిరిగుట్టను గొప్పగా కట్టారని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రశంసించారు. ఆంధ్రలో తిరుమల దేవస్థానం ఎలా ఉందో, తెలంగాణలో కూడా అలా యాదగిరిగుట్ట దేవస్థానం ఉండాలనే కేసీఆర్ ఆకాంక్ష చాలా బలమైనదని ఆయన అన్నారు.
యాదగిరిగుట్ట కట్టాలన్న ఆలోచన రావడం, భగవంతుడు కేసీఆర్‌కు కల్పించడం అభినందనీయమనీ యాదగిరిగుట్ట శ్రీలక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయం కట్టినందుకు కేసీఆర్‌ని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను అని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. దీంతో ప్రత్యర్థులు సైతం మెచ్చుకునేలా మాజీ సీఎం కేసీఆర్ పనులు చేశారనడానికి ఇదే నిదర్శనమని ఆ వీడియోలను బీఆర్‌ఎస్ శ్రేణులు వైరల్ చేస్తున్నాయి. ఆయన గొప్ప లీడర్ అని పేర్కొంటున్నారు
Next Story