ఏపీ బీఆరెస్ అధ్యక్షుడిగా తోట చంద్ర శేఖర్ ను నియమించిన కేసీఆర్
AP BRS President: బీఆరెస్ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ తోట చంద్ర శేఖర్ ను ఆంధ్రప్రదేశ్ బీఆరెస్ అధ్యక్షునిగా నియమించారు. రాబోయే కాలంలో ఏపీ నుండి ఆశ్చర్యకరమైన చేరికలు ఉంటాయని, సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా బీఆరెస్ లో చేరడానికి ఉత్సాహం చూపిస్తున్నారని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి భారత రాష్ట్ర సమితిలో ఈ రోజు కేసీఆర్ చేతుల మీదుగా పెద్ద ఎత్తున చేరికలు జరిగాయి. మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్ర శేఖర్, మాజీ మంత్రి, దళిత నాయకులు రావుల కిశోర్, మాజీ ఐఆరెస్ పార్దసారథితో పాటు వందలాది మంది నాయకులు, వివిధ వర్గాల ప్రజలు తెలంగాణ భవన్ లో బీఆరెస్ లో చేరారు.
ఈ సందర్భంగా బీఆరెస్ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ తోట చంద్ర శేఖర్ ను ఆంధ్రప్రదేశ్ బీఆరెస్ అధ్యక్షునిగా నియమించారు. రాబోయే కాలంలో ఏపీ నుండి ఆశ్చర్యకరమైన చేరికలు ఉంటాయని, సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా బీఆరెస్ లో చేరడానికి ఉత్సాహం చూపిస్తున్నారని చెప్పారు.
రావెల కిశోర్ బాబును దేశవ్యాప్తంగా దళిత ప్రజానీకాన్ని చైతన్యం చేయడానికి ఉపయోగించుకుంటామని కేసీఆర్ తెలిపారు. ఆయన కాన్షీరాం లాంటి మహనీయులతో పని చేసిన వ్యక్తి అని ప్రశంసించారు.
సంక్రాంతి తర్వాత అన్ని రాష్ట్రాల్లో చురుకుగా పని మొదలు పెడతామని, బీఆరెస్ ఇక ఉరుకులు పరుగులుపెడుతుందన్నారు కేసీఆర్.