మరో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. మెదక్ అభ్యర్థిగా మాజీ కలెక్టర్
మెదక్ పార్లమెంట్ విషయంలో అనూహ్య నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్. మొన్నటి వరకు ఒంటేరు ప్రతాప్ రెడ్డి, చిలుముల మదన్ రెడ్డి పేర్లు వినిపించాయి.
బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మరో రెండు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మెదక్, నాగర్‌కర్నూలు అభ్యర్థులను ఫైనల్ చేశారు. ఈ మేరకు పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. నాగర్‌కర్నూలు పార్లమెంట్ స్థానం నుంచి ఇటీవల పార్టీలో చేరిన మాజీ ఐపీఎస్ అధికారి R.S.ప్రవీణ్‌కుమార్‌ను అభ్యర్థిగా ప్రకటించారు.
ఇక మెదక్ పార్లమెంట్ విషయంలో అనూహ్య నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్. మొన్నటి వరకు ఒంటేరు ప్రతాప్ రెడ్డి, చిలుముల మదన్ రెడ్డి పేర్లు వినిపించాయి. ఓ దశలో హరీష్ రావు పోటీ చేస్తారని కూడా ప్రచారం జరిగింది. కానీ కేసీఆర్ ఊహించని అభ్యర్థిని తెరపైకి తెచ్చారు. మాజీ ఐఏఎస్ అధికారి పి.వెంకట్రామిరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. వెంకట్రామిరెడ్డి గతంలో సిద్దిపేట కలెక్టర్‌గా పనిచేశారు. అనంతరం వీఆర్ఎస్ తీసుకుని బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన వెంటనే ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు కేసీఆర్.
తాజాగా రెండు స్థానాలకు అభ్యర్థుల ప్రకటనతో మొత్తం 13 స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించినట్లయింది. హైదరాబాద్, సికింద్రాబాద్, భువనగిరి, నల్గొండ ఎంపీ సీట్లు పెండింగ్‌లో ఉన్నాయి. త్వరలోనే ఈ సీట్లపై కూడా క్లారిటీ రానుంది.