Telugu Global
Telangana

బాజిరెడ్డి, గాలి అనిల్‌కుమార్‌.. తొమ్మిదికి చేరిన BRS ఎంపీ అభ్యర్థులు

నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానంలో మున్నూరు కాపు సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉండడం, సీనియర్ నేత కావడంతో బాజిరెడ్డి వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

బాజిరెడ్డి, గాలి అనిల్‌కుమార్‌.. తొమ్మిదికి చేరిన BRS ఎంపీ అభ్యర్థులు
X

బీఆర్ఎస్‌ అధినేత మరో రెండు పార్లమెంట్‌ స్థానాల్లో అభ్యర్థులపై సస్పెన్స్‌కు తెరదించారు. నిజామాబాద్, జహీరాబాద్ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. నిజామాబాద్ నుంచి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌, జహీరాబాద్ నుంచి గాలి అనిల్‌ కుమార్‌లను అభ్యర్థులుగా ఫైనల్ చేశారు.

నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానంలో మున్నూరు కాపు సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉండడం, సీనియర్ నేత కావడంతో బాజిరెడ్డి వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. 2014లో ఈ స్థానం నుంచి కేసీఆర్ కూతురు కవిత విజయం సాధించారు. అయితే 2019లో ధర్మపురి అర్వింద్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ సారి పోటీకి కవిత దూరంగా ఉండడంతో అర్వింద్‌పై పోటీకి బాజిరెడ్డిని అభ్యర్థిగా ఎంచుకున్నారు కేసీఆర్.


ఇక జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ బీబీపాటిల్ ఇటీవల బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ గాలి అనిల్ కుమార్‌కు అవకాశమిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ముందు గాలి అనిల్ కుమార్ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి బీఆర్ఎస్‌లో చేరారు. జహీరాబాద్‌లో కాంగ్రెస్‌ నుంచి సురేష్‌ షెట్కార్, బీజేపీ నుంచి బీబీపాటిల్ బరిలో ఉండనున్నారు.

బీఆర్ఎస్ ప్రకటించిన 9 మంది అభ్యర్థులు -

కరీంనగర్ - బోయిన్‌పల్లి వినోద్‌కుమార్

పెద్దపల్లి - కొప్పుల ఈశ్వర్

వరంగల్ - కడియం కావ్య

ఖమ్మం - నామా నాగేశ్వర రావు

మహబూబ్‌నగర్‌ - మన్నె శ్రీనివాస్ రెడ్డి

మహబూబాబాద్‌ - మాలోత్ కవిత

జహీరాబాద్ - గాలి అనిల్ కుమార్

నిజామాబాద్ - బాజిరెడ్డి గోవర్ధన్‌

చేవెళ్ల - కాసాని జ్ఞానేశ్వర్

First Published:  13 March 2024 11:12 PM IST
Next Story