Telugu Global
Telangana

మునుగోడు అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్

కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని మునుగోడు టీఆరెస్ అభ్యర్థిగా ఆ పార్టీ ప్రకటించింది. టీఆరెస్ అధినేత కేసీఆర్ కొద్ది సేపటి క్రితం ప్రభాకర్ రెడ్డి అభ్యర్త్విత్వాన్ని వెల్లండించారు.

మునుగోడు అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్
X

మునుగోడు ఉప ఎన్నికలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా.. మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జీ, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ఆ పార్టీ అధినేత సిఎం కెసిఆర్ ప్రకటించారు.

పార్టీ ఆవిర్భావ కాలం నుంచీ టీఆరెస్ లో కొనసాగుతున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డినే కోరుకుంటూ, స్థానిక నాయకులు కార్యకర్తలు, జిల్లా పార్టీ నాయకత్వం, నియోజకవర్గ ప్రజల అభిప్రాయాలను, సర్వే రిపోర్టులను పరిశీలించిన మీదట సిఎం కెసిఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్రభాకర్ రెడ్డిది నల్గొండ జిల్లా, సంస్థాన్ నారాయణపూర్‌లోని సర్వేల్ గ్రామం.రైతు కుటుంబంలో జన్మించిన ప్రభాకర్ రెడ్డి B.Sc, B.Ed చేసిఒ ఉపాధ్యాయునిగా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత విద్యాసంస్థను ప్రారంభించి విజయవంతంగా నడిపారు.

2002లో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరి రాష్ట్ర సాధన కోసం ఉద్యమించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మునుగోడులో జరిగిన ఆందోళనలో అగ్రగామిగా నిలిచారు. ఆ సమయంలో జనంలో బాగా పాపులర్ అయ్యాడు. అతని తల్లి ఫ్లోరోసిస్ బాధితురాలు.

ప్రభాకర్ రెడ్డి మొదటి సారి మునుగోడు నియోజకవర్గం నుంచి 2014 లో టీఆరెస్ తరపున 38,055 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మునుగోడు ప్రాంత ప్రజలకోసం మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ ద్వారా ఫ్లోరోసిస్ నిర్మూలన‌, ఆరోగ్యం, విద్య తదితర ప్రధాన కార్యక్రమాల ద్వారా చురుకుగా పని చేశారు.

2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో, అతను మరోసారి టిఆర్ఎస్ టిక్కెట్ పై ఎమ్మెల్యేగా పోటీ చేసి, కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతిలో ఓడిపోయారు.

ఓటమిపాలైనప్పటికీ ఇప్పటికీ ప్రజల తలలో నాలుకగా ఉంటూ టీఆరెస్ కార్యక్రమాలను కొనసాగించడంతో మళ్ళీ టీఆరెస్ టిక్కట్ దక్కించుకున్నారు.

First Published:  7 Oct 2022 12:23 PM IST
Next Story