Telugu Global
Telangana

వరంగల్‌ బీఆర్ఎస్‌ ఎంపీ అభ్య‌ర్థిగా సుధీర్‌ కుమార్.. నేపథ్యం ఇదే.!

2001 నుంచి పార్టీలో కొనసాగుతున్న మారేపల్లి సుధీర్ కుమార్‌ ప్రస్తుతం హన్మకొండ జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా ఉన్నారు. ఉద్యమకారుడిగా, పార్టీకి విధేయుడిగా మారేపల్లికి గుర్తింపు ఉంది.

వరంగల్‌ బీఆర్ఎస్‌ ఎంపీ అభ్య‌ర్థిగా సుధీర్‌ కుమార్.. నేపథ్యం ఇదే.!
X

వరంగల్‌ బీఆర్ఎస్ అభ్యర్థిగా మారేపల్లి సుధీర్‌కుమార్‌ను ఎంపిక చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. వరంగల్‌ బీఆర్ఎస్ పార్టీ నేతలతో చర్చించిన అనంతరం సుధీర్‌కుమార్‌ను అభ్యర్థిగా ఖరారు చేశారు. సుధీర్‌ కుమార్ అభ్యర్థిత్వాన్ని వరంగల్ జిల్లా బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఏకగ్రీవంగా ఆమోదించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

2001 నుంచి పార్టీలో కొనసాగుతున్న మారేపల్లి సుధీర్ కుమార్‌ ప్రస్తుతం హన్మకొండ జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా ఉన్నారు. ఉద్యమకారుడిగా, పార్టీకి విధేయుడిగా మారేపల్లికి గుర్తింపు ఉంది. మాదిగ సామాజికవర్గానికి చెందిన సుధీర్‌ కుమార్ ఎంపిక మంచి నిర్ణయమని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.


వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ముందుగా కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యను ప్రకటించారు కేసీఆర్. అయితే బీఆర్‌ఎస్‌ నుంచి పోటీకి విముఖత వ్యక్తం చేసిన కావ్య.. తండ్రి శ్రీహరితో కలిసి కాంగ్రెస్‌లో చేరిపోయారు. ప్రస్తుతం ఆమె కాంగ్రెస్ నుంచి వరంగల్ ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఇక కావ్య రాజీనామాతో బీఆర్ఎస్‌ ఎంపీ అభ్యర్థి రేసులో చాలా మంది పేర్లు వినిపించాయి. పెద్ది స్వప్న, స్టేషన్‌ ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జోరిక రమేష్ పేర్లు వినిపించాయి. చివరకు సుధీర్ కుమార్ పేరును కేసీఆర్ ఫైనల్ చేశారు. దీంతో బీఆర్ఎస్ మొత్తం 17 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లయింది.

First Published:  12 April 2024 6:22 PM IST
Next Story