Telugu Global
Telangana

మొన్న కార్నింగ్‌.. ఇప్పుడు కెయిన్స్‌ టెక్‌.. తరలిపోతున్న భారీ పెట్టుబడి

గుజరాత్‌లోని సనంద్‌లో ఔట్‌సోర్సింగ్‌ సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్టింగ్‌ యూనిట్ ఏర్పాటు చేయనుంది కెయిన్స్‌. ఇందుకోసం దాదాపు రూ.5 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది.

మొన్న కార్నింగ్‌.. ఇప్పుడు కెయిన్స్‌ టెక్‌.. తరలిపోతున్న భారీ పెట్టుబడి
X

తెలంగాణ నుంచి మరో భారీ పెట్టుబడి గుజరాత్‌కు వెళ్లిపోనుందని సమాచారం. రాష్ట్రంలో చిప్‌ తయారీ యూనిట్ నెలకొల్పేందుకు కేసీఆర్‌ ప్రభుత్వంతో 5 నెలల క్రితం ఒప్పందం చేసుకుంది కెయిన్స్‌ టెక్‌. తాజాగా ఆ ఆలోచనను విరమించుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. చిప్‌ తయారీ యూనిట్‌ను తెలంగాణ నుంచి గుజరాత్‌కు తరలించేందుకు ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది.


గుజరాత్‌లోని సనంద్‌లో ఔట్‌సోర్సింగ్‌ సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్టింగ్‌ యూనిట్ ఏర్పాటు చేయనుంది కెయిన్స్‌. ఇందుకోసం దాదాపు రూ.5 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. సనంద్‌లో ఇప్పటికే అమెరికన్ సంస్థ మైక్రాన్, మురుగప్ప గ్రూప్ చిప్‌ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నాయి. అయితే పరిశ్రమల శాఖ అధికారులు మాత్రం కంపెనీ తరలిపోతున్నట్లు తమకు అవగాహన లేదని చెప్తున్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్న రెండో సంస్థ. గతంలో అమెరికాకు చెందిన ప్రఖ్యాత గొరిల్లా గ్లాస్ తయారీ కంపెనీ కార్నింగ్ తమిళనాడుకు తరలిపోయింది. అంతకుముందు తెలంగాణలో రూ.934 కోట్లు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్న కార్నింగ్..రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో తమిళనాడుకు తరలించింది.

First Published:  12 March 2024 11:19 AM IST
Next Story