Telugu Global
Telangana

బతుకమ్మ పాట పదిలంగా ఉండాలంటే..?

2014లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ పల్లెలన్నీ నీళ్లతో, చెరువులతో క‌ళకళలాడుతున్నాయని తెలిపారు కవిత. అమ్మవారి దయతో తెలంగాణ ఇలానే సుభిక్షంగా ఉండాలని, మంచి పంటలు పండాలని ఆకాంక్షించారు.

బతుకమ్మ పాట పదిలంగా ఉండాలంటే..?
X

మొట్టమొదటిసారిగా మైక్ ముందు బతుకమ్మ పాట పాడానని, యూట్యూబ్‌ లో అందరూ ఆ పాట విని అభిప్రాయాలు తెలియజేయాలని కోరారు ఎమ్మెల్సీ కవిత. ఆమె పాడిన బతుకమ్మ పాట సోషల్ మీడియాలో విడుదలై ప్రశంసలు అందుకుంటోంది. రాబోయే తరాల్లో బతుకమ్మ పాట పదిలంగా ఉండాలంటే, పిల్లలకు నేర్పించాలని సూచించారు కవిత. తెలంగాణ ఉద్యమ సమయంలో పాఠశాలలకు వెళ్లి చిన్న పిల్లలకు బతుకమ్మ ఆవశ్యకతను చెప్పేవాళ్లమని గుర్తుచేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరింత ఉత్సాహంతో ఘనంగా బతుకమ్మను నిర్వహించుకుంటున్నామని అన్నారు కవిత.

2014లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ పల్లెలన్నీ నీళ్లతో, చెరువులతో క‌ళకళలాడుతున్నాయని తెలిపారు కవిత. అమ్మవారి దయతో తెలంగాణ ఇలానే సుభిక్షంగా ఉండాలని, మంచి పంటలు పండాలని ఆకాంక్షించారు. జగిత్యాలలో బతుకమ్మ ఆడారామె. ఎంతో విశిష్టత కలిగిన తెలంగాణ పండగలను సగర్వంగా చాటి చెబుదామని, మన సంస్కృతిని ఇలానే కొనసాగిద్దామని పిలుపునిచ్చారు.

తెలంగాణ పండగలు, కళలు ఎప్పటికీ వర్ధిల్లుతుండాలని అన్నారు కవిత. వందల ఏళ్ల నుంచి బతుకమ్మ పండుగతో సంస్కృతిని కాపాడుతున్న ఘనత మహిళలకు దక్కుతుందని స్పష్టం చేశారు. మరో వందేళ్లపాటు కూడా బతుకమ్మ పండుగకు డోఖా ఉండకూడదనే ఉద్దేశంతో పిల్లలకు బతుకమ్మ పాటలు నేర్పిస్తున్నామని చెప్పారు. సంస్కృతి లేని సమాజం వేర్లు లేని చెట్టు వంటిదని చెప్పారు. సంస్కృతిని మరిచిపోయే సమాజం బాగుండదు కాబట్టి పండగలను సగర్వంగా చాటి చెబుతూ ముందుకు తీసుకెళ్లాలని సూచించారు కవిత.

First Published:  17 Oct 2023 4:06 PM GMT
Next Story