సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కాసాని జ్ఞానేశ్వర్
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని బీఆర్ఎస్ నేత కాసాని జ్ఞానేశ్వర్ కుటుంబసమేతంగా కలిశారు. జూబ్లీహిల్స్ ముఖ్యమంత్రి నివాసంలో కలిసి తమ కుమారుడి వివాహానికి హాజరు కావాలని సీఎంని ఆహ్వానించారు.
BY Vamshi Kotas6 Nov 2024 3:24 PM IST
X
Vamshi Kotas Updated On: 6 Nov 2024 3:24 PM IST
సీఎం రేవంత్‌రెడ్డిని బీఆర్ఎస్ నేత కాసాని జ్ఞానేశ్వర్ కుటుంబసమేతంగా కలిశారు. జూబ్లీహిల్స్ ముఖ్యమంత్రి నివాసంలో కలిసి తమ కుమారుడి వివాహానికి హాజరు కావాలని సీఎంని ఆహ్వానించారు. పెళ్లికి వచ్చి నూతన వధూవరులను ఆశ్వీదించాలని ముఖ్యమంత్రిని కాసాని కోరారు. కానీ ఈ సమావేశం లో ఎలాంటి రాజకీయ విషయాలు చర్చకు రాలేదని తెలుస్తోంది.
కానీ కొంత మంది మాత్రం… బీఆర్ఎస్ నేత కాసాని జ్ఞానేశ్వర్.. కాంగ్రెస్ పార్టీలోకి వెళుతున్నారని ప్రచారం చేస్తున్నారు. అందుకే తమ కుమారుడి వివాహానికి హాజరు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కుటుంబసమేతంగా బీఆర్ఎస్ నేత కాసాని జ్ఞానేశ్వర్ ఆహ్వానించారని చెబుతున్నారు. ఇక ఎన్నికల కంటే ముందు టీడీపీ పార్టీలో ఉన్న బీఆర్ఎస్ నేత కాసాని జ్ఞానేశ్వర్..బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
Next Story