ఈటల పోతే కాసాని.. కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
ముదిరాజ్ వర్గానికి సంబంధించి ఈటల రాజేందర్ పోయినా, అంతకంటే పెద్ద మనిషి కాసాని జ్ఞానేశ్వర్ మన పార్టీలోకి వచ్చారని అన్నారు సీఎం కేసీఆర్. ఎన్నికల తర్వాత ముదిరాజ్ లతో ప్రత్యేకంగా సమావేశం అవుతానన్నారు.
టీటీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన కాసాని జ్ఞానేశ్వర్ ఈరోజు బీఆర్ఎస్ లో చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు సీఎం కేసీఆర్. సిద్ధిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఈ చేరికల కార్యక్రమం జరిగింది. ముదిరాజ్ వర్గానికి సంబంధించి ఈటల రాజేందర్ పోయినా, అంతకంటే పెద్ద మనిషి కాసాని జ్ఞానేశ్వర్ మన పార్టీలోకి వచ్చారని అన్నారు సీఎం కేసీఆర్. ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి ఈటల రాజేందర్ ఎవ్వరినీ ఎదగనివ్వలేదన్నారు. ఎన్నికల తర్వాత ముదిరాజ్ లతో ప్రత్యేకంగా సమావేశం అవుతానన్నారు కేసీఆర్.
బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన టీటీడీపీ కి రాజీనామా చేసిన ఆ పార్టీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్
— BRS Party (@BRSparty) November 3, 2023
గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బీఆర్ఎస్ అధినేత
కాసానితో పాటు ముదిరాజులకు సముచిత స్థానం కల్పిస్తాం
రాజేందర్ వెళ్లినా అంతకంటే… pic.twitter.com/6NCAMaHlz3
"తమాషాకి అభ్యర్థులను నిలబెట్టడం కాదు, నిలబెడితే గెలవాలంతే..!" అని అన్నారు సీఎం కేసీఆర్. రాజకీయాల్లో ఒక్కొక్క సీటు కౌంట్ అవుతుందన్నారు. అభ్యర్థిని నిలబెట్టాలంటే కచ్చితంగా గెలవాలన్నారు. పద్మశాలి వర్గానికి టికెట్ ఇవ్వాలని వెదికి.. సంగారెడ్డి నుంచి చింత ప్రభాకర్ కు టికెట్ ఇచ్చామన్నారు. ఏమవుతుందో చూడాలన్నారు కేసీఆర్.
ముదిరాజ్ లకు అవకాశాలు..
ముదిరాజ్ సామాజిక వర్గానికి రాజకీయంగా మంచి అవకాశాలు ఉంటాయన్నారు సీఎం కేసీఆర్. ఎన్నికల తరువాత ముదిరాజ్ లతో సమావేశం అవుతానన్నారు. వృత్తి పరంగా ముదిరాజ్ లకు న్యాయం జరిగిందన్నారు. గ్రామాల్లో ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవులు ముదిరాజ్ లకు వస్తాయన్నారు. ముదిరాజ్ ల నుండి ఎక్కువ సంఖ్యలో నాయకులు తయారు కావాలని సూచించారు. నామినేటెడ్ పదవుల్లో ముదిరాజ్ లకు పెద్ద పీట వేస్తామని హామీ ఇచ్చారు కేసీఆర్.