Telugu Global
Telangana

తెలంగాణలో రోడ్డెక్కిన కర్నాటక రైతులు.. ఎందుకంటే..?

జోగులాంబ గద్వాల జిల్లాలో రోడ్లపై కూర్చుని ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శనలు చేపట్టారు. తమకు జరిగిన అన్యాయాన్ని వారు తెలంగాణ రైతులకు వివరించారు.

తెలంగాణలో రోడ్డెక్కిన కర్నాటక రైతులు.. ఎందుకంటే..?
X

తెలంగాణలో కర్నాటక రైతులు రోడ్డెక్కారు. జోగులాంబ గద్వాల జిల్లాలో రోడ్లపై కూర్చుని ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శనలు చేపట్టారు. తమకు జరిగిన అన్యాయాన్ని వారు తెలంగాణ రైతులకు వివరించారు. తమలాగా మోసపోవద్దని హితవు పలికారు. తాము కాంగ్రెస్ ని నమ్మి మోసపోయామని, తెలంగాణ రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ తప్పు చేయొద్దని కోరారు.

నమ్మక ద్రోహం..

కర్నాటకలో రైతుల్ని కాంగ్రెస్ నిట్ట నిలువునా మోసం చేసిందంటున్నారు అక్కడి రైతులు. కాంగ్రెస్ ని నమ్మి అధికారం కట్టబెడితే.. ఇప్పుడు కరెంటు లేకుండా చేస్తోందని, పైర్లు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎడాపెడా కరెంటు కోతలతో సామాన్యులు అల్లాడిపోతున్నారని, రైతుల పరిస్థితి దారుణంగా తయారైందని అంటున్నారు. తెలంగాణలో ఎన్నికల వేళ, కర్నాటక రైతులు ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ప్రచారం చేయడం ఆసక్తిగా మారింది.

కల్యాణ్ కర్నాటక రైతు సంఘం నేతలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. కర్నాటకలో ఐదు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు వాటిని అమలు చేయలేకపోతోందంటున్నారు రైతులు. ఇక్కడ కూడా కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలంటూ ప్రజల ముందుకు వచ్చింది. ఆ గ్యారెంటీలను నమ్మితే మాత్రం మోసపోవడం గ్యారెంటీ అంటున్నారు కల్యాణ్ రైతు సంఘం నేతలు. తాము చేసిన తప్పు మీరు చేయొద్దు అంటూ ఇక్కడి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.

First Published:  24 Oct 2023 7:10 PM IST
Next Story