Telugu Global
Telangana

యాడ్ ఇచ్చారు.. అడ్డంగా దొరికారు..!

యువనిధి పథకం కింద ముద్రించిన లబ్ధిదారుని ఫోటో బీఆఆర్ఎస్‌కు అస్త్రంగా మారింది. యాడ్ ఏజెన్సీల నుంచి మోడల్ ఫొటోను తీసుకువచ్చి ముద్రించారంటూ బీఆర్ఎస్‌ చెప్తోంది.

యాడ్ ఇచ్చారు.. అడ్డంగా దొరికారు..!
X

తెలంగాణలో గెలిచేందుకు కాంగ్రెస్‌ శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. కర్ణాటకలో అమలు చేసిన వ్యూహాలనే ఇక్కడ అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కర్ణాటకలో 5 గ్యారెంటీలతో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. అయితే కర్ణాటకలో కాంగ్రెస్‌ ఐదు గ్యారెంటీలు అమలు చేయలేకపోతుందని, అభివృద్ధి పనులకు నిధులు లేవన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇదే విషయాన్ని బీఆర్ఎస్‌ కూడా తన ప్రచారంలో అస్త్రంగా ఉపయోగించుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇచ్చిన 5 గ్యారెంటీ స్కీంలను సక్సెస్‌ఫుల్‌గా అమలు చేస్తున్నామంటూ తెలంగాణలోని న్యూస్‌ పేపర్లకు యాడ్ ఇచ్చింది కర్ణాటక ప్రభుత్వం.

కర్ణాటకలోని 96 శాతం మంది ఏదో ఓ గ్యారెంటీ ద్వారా లబ్ధి పొందుతున్నారంటూ తన ప్రకటనలో చెప్పుకొచ్చింది. ఇందులో భాగంగా 5 గ్యారెంటీల ద్వారా లబ్ధి పొందారంటూ ఐదుగురు లబ్ధిదారుల ఫోటోలను వారి అభిప్రాయాలను ముద్రించింది. ఇక్కడే కాంగ్రెస్ పప్పులో కాలేసింది.


అయితే యువనిధి పథకం కింద ముద్రించిన లబ్ధిదారుని ఫోటో బీఆర్ఎస్‌కు అస్త్రంగా మారింది. యాడ్ ఏజెన్సీల నుంచి మోడల్ ఫొటోను తీసుకువచ్చి ముద్రించారంటూ బీఆర్ఎస్‌ చెప్తోంది. అతను అసలైన లబ్ధిదారుడు కాదంటూ కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసింది. ఇందుకు పక్కా ఆధారాలు కూడా చూపిస్తోంది. ఫేక్‌ విషయాలు చెప్పడంలో సునీల్ కనుగోలు కాంగ్రెస్‌ను సైతం బీజేపీలా మార్చారంటూ సెటైర్లు వేస్తోంది బీఆర్ఎస్.

First Published:  24 Nov 2023 6:50 AM GMT
Next Story