బీజేపీ నేతలపై పరువు నష్టం దావా వేయనున్న కవిత
తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న బీజెపి నేతలపై కల్వకుంట్ల కవిత పరువు నష్టం దావా వేయనున్నారు. బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సిర్సా లు తనపై నిరాధార ఆరోపణలు చేసినందుకు వ్యతిరేకంగా ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వాలని కవిత కోర్టును కోరనున్నారు.
BY Telugu Global22 Aug 2022 3:25 PM IST

X
Telugu Global Updated On: 22 Aug 2022 3:25 PM IST
ఢిల్లీ లిక్కర్ స్కాం కు సంబంధించి తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్న బీజేపీ నాయకులపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరువు నష్టం దావా వేయనున్నారు. దీనిపై ఆమె న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నారు. తనపై అబద్దపు ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సిర్సాపై పరువు నష్టం దావా వేయడంతో పాటు నిరాధార ఆరోపణలు చేసినందుకు వ్యతిరేకంగా ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వాలని కవిత కోర్టును కోరనున్నారు.
కాగా కొద్ది సేపటి క్రితమే కవిత బీజేపీ నేతలపై విమర్షలు గుప్పించారు. తన తండ్రి కేసీఆర్ ను దెబ్బ తీయడం కోసమే తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడిన ఆమె ఏ విచారణకైనా తాను సిద్దమని స్పష్టం చేశారు.
Next Story