Telugu Global
Telangana

కూతురికి ఎంపీ టికెట్‌, పార్టీ మార్పు.. క్లారిటీ ఇచ్చిన కడియం

ఆయన కూతురు కావ్యకు ఎంపీ టికెట్‌తో పాటు తనకు మంత్రి పదవి ఇస్తే పార్టీ మారేందుకు కడియం ఓకే చెప్పారంటూ వార్తలు వచ్చాయి.

కూతురికి ఎంపీ టికెట్‌, పార్టీ మార్పు.. క్లారిటీ ఇచ్చిన కడియం
X

పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. బీఆర్ఎస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు కడియం.

కడియం శ్రీహరి కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నారంటూ రెండు రోజులుగా సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆయన కూతురు కావ్యకు ఎంపీ టికెట్‌తో పాటు తనకు మంత్రి పదవి ఇస్తే పార్టీ మారేందుకు కడియం ఓకే చెప్పారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఆయన కూతురు కావ్యకు ఎంపీ టికెట్ ఇచ్చేందుకు ఓకే చెప్పిన కాంగ్రెస్ అధిష్టానం.. మంత్రి పదవి విషయంలో మాత్రం హామీ ఇవ్వలేదని పొలిటికల్‌, మీడియా సర్కిల్స్‌లో చర్చ జరిగింది.

అయితే ఇవాళ హైదరాబాద్‌ నందినగర్‌లోని నివాసంలో కేసీఆర్‌ను కలిశారు కడియం శ్రీహరి. తాను కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలన్ని ప్రచారం మాత్రమేనన్నారు. తాను ఎవరితో టచ్‌లో లేనని చెప్పారు. ఫేక్ వార్తలను నమ్మొద్దని, బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు కడియం. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండు స్థానాల్లో మాత్రమే బీఆర్ఎస్ విజయం సాధించింది. స్టేషన్‌ ఘన్‌పూర్ స్థానం నుంచి కడియం శ్రీహరి, జనగాం నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్‌ నుంచి విజయం సాధించారు.

First Published:  13 March 2024 11:19 AM GMT
Next Story