Telugu Global
Telangana

రేవంత్ రెడ్డికి మద్దతివ్వాలన్నారు.. కానీ ఫస్ట్ లిస్ట్ విడుదల చేశా..!

షర్మిల రెడ్డి, కోదండరాం రెడ్డి.. ఇలా ఆ సామాజిక వర్గానికి చెందినవారంతా రేవంత్ రెడ్డికి మద్దతు తెలుపుతున్నారని చెప్పారు కేఏపాల్. కానీ తానొక్కడినే నిఖార్సయిన నేతను అని, తాను షర్మిల లాగా ప్యాకేజీ స్టార్ ని మాత్రం కాదని అన్నారు.

రేవంత్ రెడ్డికి మద్దతివ్వాలన్నారు.. కానీ ఫస్ట్ లిస్ట్ విడుదల చేశా..!
X

రేవంత్ రెడ్డికి మద్దతివ్వాలన్నారు.. కానీ ఫస్ట్ లిస్ట్ విడుదల చేశా..!

అభ్యర్థుల జాబితాలు విడుదల చేసేందుకు కాంగ్రెస్, బీజేపీ.. రకరకాల లెక్కలు వేసుకుంటుంటే.. సందడ్లో సడేమియా అంటూ కేఏపాల్ తన ఫస్ట్ లిస్ట్ విడుదల చేశారు. మొత్తం 12మంది అభ్యర్థులతో ఆయన ఫస్ట్ లిస్ట్ విడుదల చేశారు. త్వరలో రెండో లిస్ట్ కూడా ఉంటుందని ప్రకటించారు. అయితే ఇందులో ఎంతమంది నామినేషన్ వేస్తారనేది తేలాల్సి ఉంది. తెలంగాణలో ప్రజాశాంతి పార్టీ తరపున పోటీ చేసేందుకు 344మంది అప్లికేషన్లు పెట్టుకున్నారని, అదీ తమ పార్టీకున్న డిమాండ్ అని అంటున్నారు పాల్.

ఆ ఆఫర్ ఏపీకి ఇస్తున్నా..

ఆమధ్య మునుగోడు ఉప ఎన్నికల్లో కేఏపాల్ రంగంలోకి దిగి హడావిడి చేశారు. ఆయనకు ఈసీ ఉంగరం గుర్తు కేటాయించగా.. చేతులకు 10 ఉంగరాలు ధరించి, రోజుకో ప్రెస్ మీట్ పెడుతూ మీడియా ముందు హల్ చల్ చేసేవారు. చివరికి ఎలక్షన్ రోజు కూడా ఆయన చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఫస్ట్ లిస్ట్ ప్రకటనతో ఆయన హడావిడి మొదలైంది. అయితే పాల్ పోటీలో ఉంటారా లేదా అనేది మాత్రం డౌటే. ఇక 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ గురించి కూడా ముందుగానే హింటిచ్చారు కేఏపాల్. తాను విశాఖ లోక్ సభ స్థానం నుంచి పోటీలో ఉంటానని చెప్పారు. అంటే ఈసారి ఆ బంపర్ ఆఫర్ ఆయన ఏపీకి ఇచ్చారన్నమాట.

నాకు ఫోన్ చేశారు..

షర్మిల రెడ్డి, కోదండరాం రెడ్డి.. ఇలా ఆ సామాజిక వర్గానికి చెందినవారంతా రేవంత్ రెడ్డికి మద్దతు తెలుపుతున్నారని చెప్పారు కేఏపాల్. కానీ తానొక్కడినే నిఖార్సయిన నేతను అని, తాను షర్మిల లాగా ప్యాకేజీ స్టార్ ని మాత్రం కాదని అన్నారు. రేవంత్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని సినీ నిర్మాత బండ్ల గణేష్ తనకు ఫోన్ చేశారని, కానీ ఆ ఆఫర్ ని తాను తిరస్కరించానని చెప్పారు. తెలంగాణలో ఉన్న పార్టీలు అన్ని అవినీతితో ఉన్నాయని, తానొక్కడినే క్లీన్ చిట్ నాయకుడిని అని గొప్పలు చెప్పుకున్నారు కేఏ పాల్.

First Published:  6 Nov 2023 5:43 PM IST
Next Story