Telugu Global
Telangana

ఇంజినీర్లపై జస్టిస్‌ పీసీఘోష్‌ అసహనం

మేడిగడ్డ ఏఈఈ, డీఈలను కాళేశ్వరం జస్టిస్‌ పీసీఘోష్‌ కమీషన్ విచారించింది.

ఇంజినీర్లపై జస్టిస్‌ పీసీఘోష్‌ అసహనం
X

కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో భాగంగా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ మేడిగడ్డ ఏఈఈ, డీఈలను విచారించింది. ఇవాళ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వద్ద పనిచేసిన డీఈఈ, ఏఈఈలు హాజరయ్యారు. ప్రాజెక్టు నిర్మాణం, పనుల వివరాలను కమిషన్‌ ఆరా తీసింది. క్షేత్రస్థాయి పనుల రిజిస్టర్లను స్వాధీనం చేసుకున్న కమిషన్‌ పనులపై ప్లేస్‌మెంట్ రికార్డులను అడిగి తెలుసుకుంది. కమిషన్‌ ముందు వాళ్లు వివరణ ఇస్తున్న సమయంలో ఒక్కసారిగా జస్టిస్‌ చంద్రఘోష్‌ అసహనానికి లోనయ్యారు. ‘‘ అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు చెప్పాలి. ముందుగా అనుకొని వచ్చి.. పొంతనలేని సమాధానాలు చెప్పొద్దు’’ అని మందలించారు.

మేడిగడ్డపై కుంగినటువంటి పిల్లర్లకు సంబంధించిన బ్లాక్ సెవెన్ రిజిస్టర్ లపై ఈ ఇద్దరు ఇంజనీర్ల సంతకాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో క్వాలిటీ కంట్రోల్ రిజిస్టర్లు మిస్ అయినట్లు గుర్తించారు. ఇక.. 2020లోనే కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీ వద్ద డ్యామేజీని గుర్తించి ఉన్నతాధికారులకు నిర్మాణ సంస్థలకు లేఖలు రాసినట్లు ఇంజినీర్లు, కమిషన్‌ ముందు చెప్పారు. కాళేశ్వరం కమిషన్‌ బహిరంగ విచారణ మొదటి రోజు ఇంజనీర్లతో ముగిసింది

First Published:  25 Nov 2024 5:11 PM IST
Next Story