జూనియర్ ఎన్టీఆర్ ప్రశ్నలకు షాక్ అయిన కెమెరామెన్
అల్లు అర్జున్ సింగిల్ గానే పోలింగ్ బూత్ కి వచ్చి ఓటు వేసి వెళ్లిపోయారు. జూనియర్ ఎన్టీఆర్.. తన తల్లి, సతీమణితో కలసి పోలింగ్ బూత్ కి వచ్చారు. కెమెరామెన్ లు చుట్టుముట్టే సరికి ఆయనలో ఓపిక నశించి.. మీరందరూ ఇక్కడే ఉంటారా..? అని ప్రశ్నించారు.
ఎన్నికల వేళ మీడియా, సోషల్ మీడియా హడావిడి మామూలుగా లేదు. సెలబ్రిటీలు ఓటు వేసేందుకు వస్తే వెంటనే కెమెరాలతో వారిని చుట్టుముడుతున్నారు. కొంతమంది సెక్యూరిటీతో వచ్చినా క్యూలైన్లలోకి మాత్రం సింగిల్ గానే వెళ్లక తప్పని పరిస్థితి. ఇంకొందరు కెమెరాలను చూసి కాస్త చిరాకుపడుతున్నారు. కుటుంబ సభ్యులతో కలసి ఓటింగ్ కి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్.. కెమెరామెన్లు చుట్టుముట్టే సరికి షాకయ్యారు. ఐదు పది నిమిషాలు ఓకే, ఆ తర్వాత కూడా కెమెరామెన్లు తమ దగ్గర నుంచి వెళ్లకపోయేసరికి.. "మీరు ఓట్లు వేయరా..?" అంటూ ప్రశ్నించారు. "మీరందరు ఇక్కడే ఉంటారా... ఓట్లు వెయ్యరా మీరు?" అని అడిగారు. ఆ ప్రశ్నతో కెమెరామెన్లు షాకయ్యారు.
మీరు వెళ్లిపోతే మేం ఓట్లు వేస్తామని ఎన్టీఆర్ కి కెమెరామెన్లు బదులిచ్చారు. టైమ్ సరిపోతుందా అని ఎన్టీఆర్ మరో ప్రశ్న వేశారు, సరిపోతుందంటూ కెమెరామెన్లు సమాధానం చెప్పారు. పక్కనే ఉన్న మరొకరు.. ఇందులో సగం మంది వేస్తారు, సగం మంది వేయరు అని సమాధానమిచ్చారు. మొత్తమ్మీద ఈ ఎపిసోడ్ ఆసక్తిగా మారింది. సెలబ్రిటీలను చుట్టు ముట్టి కెమెరాలతో ఇబ్బంది పెట్టేవారిని ఎన్టీఆర్ సూటి ప్రశ్న కాస్త ఇబ్బంది పెట్టిందనే అనుకోవాలి.

♦