Telugu Global
Telangana

చంచల్ గూడ జైలు నుండి విడుదలైన జర్నలిస్టులు రేవతి, తన్వీ యాదవ్

చంచల్ గూడ జైల్లో రిమాండ్‌లో ఉన్న జర్నలిస్టులు రేవతి, తన్వీ యాదవ్ బెయిల్ పై విడుదల అయ్యారు.

చంచల్ గూడ జైలు నుండి విడుదలైన జర్నలిస్టులు రేవతి, తన్వీ యాదవ్
X

చంచల్ గూడ జైల్లో రిమాండ్‌లో ఉన్న పల్స్‌ న్యూస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పీ రేవతి, న్యూస్‌ రిపోర్టర్‌ బండి సంధ్య అలియాస్‌ తన్వీ యాదవ్‌ బెయిల్ పై విడుదల అయ్యారు. జైలు వద్ద మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుని విమర్శిస్తే అక్రమ కేసులు బనాయించి జైల్లో నిర్బంధించారని తెలిపారు. తమ అరెస్టుకు పార్టీలకు అతీతంగా వ్యతిరేకిస్తూ మద్దతు తెలిపిన వారికి ధన్యావాదాలు తెలిపారు. తోటి జర్నలిస్టుల సహకారం మరవులేనిది వారు తెలిపారు.

రేవంత్ సర్కార్‌ను నిలదీసిన ఓ రైతు వీడియోను పోస్ట్‌ చేయడమే పెద్ద నేరమైంది. ప్రజా సమస్యలను తమ చానల్‌ ద్వారా ప్రసారం చేయడమే కాంగ్రెస్‌ సర్కారుకు కంటగింపుగా మారింది. ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం అంటూ మహిళా జర్నలిస్టులను అదుపులోకి తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ప్రభుత్వానికి, సీఎంకు వ్యతిరేకంగా ఓరైతు మాట్లాడిన వీడియోను తన యూట్యూబ్‌ చానల్‌లో పోస్టు చేసినందుకు అరెస్టు చేస్తున్నట్టు ఆమెకు నోటీసు ఇచ్చారు. అదే సమయంలో కొత్తూరులో మరో మహిళా జర్నలిస్ట్‌ సంధ్య అలియాస్‌ తన్వీ యాదవ్‌ ఇంటికి పోలీసులు వెళ్లి ఆమెను కూడా అరెస్ట్‌ చేశారు. అరెస్టుల అనంత‌రం వీరిద్ద‌రిని 8గంటల పాటు రహస్యంగా విచారించారు.

First Published:  18 March 2025 9:00 PM IST
Next Story