జాబ్ క్యాలెండర్ గొడవ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అరెస్ట్
తెలంగాణ యువతకు న్యాయం జరిగే వరకు తాము వారి వెంటే ఉంటామని చెప్పారు కేటీఆర్. అప్పటి వరకు తాము ప్రభుత్వం వెంట పడతామన్నారు.
తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. అయితే అది బోగస్ క్యాలెండర్ అని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగుల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఈ క్రమంలో గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. వారిని పోలీసులు బలవంతంగా అక్కడినుంచి తరలించారు. అరెస్ట్ చేసి పోలీస్ వ్యాన్ లో గన్ పార్క్ నుంచి తీసుకెళ్లారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, నిరసన తెలిపే హక్కు కూడా తమకు లేదా అంటూ.. బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
నిరుద్యోగుల కోసం గన్ పార్క్ వద్ద ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అక్రమంగా అరెస్టు చేసిన పోలీసులు.@KTRBRS @BRSHarish pic.twitter.com/t7cyGIDytk
— BRS Party (@BRSparty) August 2, 2024
తెలంగాణ యువతకు న్యాయం జరిగే వరకు తాము వారి వెంటే ఉంటామని చెప్పారు కేటీఆర్. అప్పటి వరకు తాము ప్రభుత్వం వెంట పడతామన్నారు. తక్షణం 2 లక్షల ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రకటన చేయాలన్నారు. రాహుల్ గాంధీ తెలంగాణ యువతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం - కేటీఆర్ pic.twitter.com/WL1pgbxbbP
— KTR News (@KTR_News) August 2, 2024
మరోవైపు నిరుద్యోగ సంఘాలు కూడా ఈ జాబ్ క్యాలెండర్ పై భగ్గుమన్నాయి. అసలు ఆ క్యాలెండర్ లో ఎన్ని పోస్ట్ లు ఖాళీ ఉన్నాయనే విషయాన్ని చెప్పలేదని, పోనీ ఏ రోజు నోటిఫికేషన్ విడుదలవుతుందనే విషయం కూడా లేదన్నారు. జాబ్ లు లేవు, క్యాలెండ్ లేదు.. అదంతా బోగస్ అని విమర్శించారు యువకులు. జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగుల్ని మోసం చేశారని విమర్శిస్తూ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్శిటీ ఎన్.సి.సి. గేటు దగ్గర ఆందోళన చేపట్టారు. రాహుల్ గాంధీ దిష్టిబొమ్మని దహనం చేశారు.
జాబ్ క్యాలెండర్ పేరుమీద నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం @RahulGandhi దిష్టిబొమ్మలను
— Gellu Srinivas Yadav (@GelluSrinuTRS) August 2, 2024
BRSV ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ NCC గేటు వద్ద దహనం చేయడం జరిగినది.@BRSparty@KCRBRSPresident @KTRBRS @revanth_anumula pic.twitter.com/2AIv5S6cxT