జేఎల్ ఫలితాలు విడుదల
తెలంగాణలో జేఎల్ ఫలితాలు రిలీజ్ అయినవి. ఎంపికైన అభ్యర్ధుల జాబితాను టీజీపీఎస్సీ వైబ్‌సైట్‌లో ఉంచింది
తెలంగాణలో జూనియర్ లెక్చరర్ పోస్టుల ఫలితాలు విడుదలయ్యాయి. ఎంపికైన అభ్యర్ధుల జాబితాను టీజీపీఎస్సీ వైబ్‌సైట్‌లో ఉంచింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయ్యాక పోస్టులకు ఎంపికైన వారి జాబితాను కమిషన్ మంగళవారం నాడు విడుదల చేసింది. టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థులు తుది ఫలితాలు చెక్ చేసుకోవాలని కమిషన్ సూచించింది.
https://websitenew.tspsc.gov.in/ జులై 8న జూనియర్ లెక్చరర్స్ రాత పరీక్షల ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. జనరల్ ర్యాంకింగ్ జాబితాలను సబ్జెక్టులవారీగా ఇచ్చారు. 1:2 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించారు. పీడబ్ల్యూడీ అభ్యర్థులకు మాత్రం 1:5 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలనకు అభ్యర్థులను ప్రకటించారు. 2022లో నోటిఫికేషన్ విడుదల చేయాగా..2023లో టీజీపీఎస్సీ పరీక్షలు నిర్వహించింది. 2024లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేశారు.