నోటికాడి కూడు లాక్కోవొద్దు..జీవన్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
హస్తం పార్టీపై ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ పదేళ్ల తరువాత అధికారంలోకి తేవడానికి కష్టపడ్డాం..ప్రస్తుతం మా నోటికాడ పళ్ళెం లాక్కున్నట్లు అయింది మా పరిస్థితని ఆయన అన్నారు.
కాంగ్రెస్ పార్టీపై మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి ఎంతో కష్టపడ్డాం.. వేరే పార్టీ నుండి హస్తం పార్టీలో చేరే ఎమ్మెల్యేల కోసం పాత వారిని పక్కన ఎక్కడదని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. నోటికాడ కూడు లాక్కున్నట్లు అయింది మా పరిస్థితి. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి 10 సంవత్సరాలు సర్వశక్తులు ఓడిన కార్యకర్తలకు అండగా ఉన్నారని జీవన్ రెడ్డి తెలిపారు. పదేళ్ల కాలంలో ఎవడెవడో తినిపోయాడు. మనకు అవకాశం లేదు. మనకెవ్వరికీ కూడా బాధ అనిపించలేదు. పదవీ కావాలని కోరుకున్నాం.ఇవాళ మన ప్రభుత్వం వచ్చింది..
మన ప్రభుత్వంలో మన హక్కుగా ఉన్నదాన్ని ఎవడైనా లాక్కూనిపోతుంటే చూస్తూ ఊరుకుంటారా..? అని ప్రశ్నించారు. పదేళ్లు పోరాటం చేసిన తరువాత.. పొరిగింటోడు వచ్చి లాక్కుంటే చూస్తుంటారా అన్నారు. మన పాలనలో మనకు స్వేచ్ఛ లేకపోతే ఎలా ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులను జీవన్‌రెడ్డి మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిరంగా ఉన్నప్పటికి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడాన్ని తప్పుబట్టారు. అంతేకాదు పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు ఆయన లేఖ రాసిన విషయం విదితమే