రాష్ట్రంలో శాంతిభద్రతలు జీవన్‌రెడ్డి వ్యాఖ్యలే నిదర్శనం : కేటీఆర్
తెలంగాణలో శాంతిభద్రతలు లేవని గత కొన్ని నెలలుగా అందరూ చెబుతున్న మాటనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అంటున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేేటీఆర్ అన్నారు
BY Vamshi Kotas22 Oct 2024 6:03 PM IST

X
Vamshi Kotas Updated On: 22 Oct 2024 6:03 PM IST
తెలంగాణలో శాంతిభద్రతలు తీవ్ర ఆందోళనకరంగా మారాయిని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేేటీఆర్ అన్నారు. గత కొన్ని నెలలుగా తాము చెబుతున్నదే ఇవాళ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి చెప్పారని కేటీఆర్ ట్వీట్టర్ వేదికగా తెలిపారు. రాష్ట్రంలో హొం మినిస్టర్ లేకపోవడంతో పోలీసులు రాజకీయ వ్యవహారాల్లో పూర్తిగా బిజీగా ఉండటంతో శాంతి భద్రతల అమలు కుంటుపడిందని కేటీఆర్ ఆరోపించారు.
రాజకీయ పెద్దలు ఇకనైనా విజ్ఞతతో ఆలోచిస్తారని అనుకుంటున్నట్లు తెలిపారు. శాంతి, సామరస్యాన్ని కాపాడే ప్రాథమిక పనిపై దృష్టి సారించేలా సమర్థులైన పోలీసులు అధికారులకు స్వేచ్ఛ ఇస్తారని ఆశిస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంపై దృష్టి పెట్టాలని కేటీఆర్ సూచించారు.
Next Story