Telugu Global
Telangana

చేరికల చిచ్చు.. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి రాజీనామా!

అధిష్టానం తీరుపై జీవన్‌రెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

చేరికల చిచ్చు.. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి రాజీనామా!
X

తెలంగాణ కాంగ్రెస్‌లో చేరికల చిచ్చు రాజుకుంది. జగిత్యాల బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే సంజయ్ చేరికపై కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి సమాచారం ఇవ్వకపోవడం చర్చనీయాంశమైంది. మొన్ననే మాజీ స్పీకర్‌, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్‌లో చేరడాన్నే జీవన్‌రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. రేవంత్‌రెడ్డిది అవకాశవాద రాజకీయమాంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చేరికలను జీవన్‌రెడ్డి అంతలా వ్యతిరేకిస్తున్నప్పటికీ.. కాంగ్రెస్ అధిష్టానం ఆయన నియోజకవర్గంలోనే పార్టీ ఫిరాయింపున‌కు పాల్పడింది. అదికూడా జీవన్‌రెడ్డికి కనీస సమాచారం ఇవ్వకుండానే ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యేను కాంగ్రెస్‌లో చేర్చుకుంది. ఇది జీవన్‌రెడ్డిని తీవ్ర మనస్తాపానికి గురిచేసినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో అధిష్టానం తీరుపై జీవన్‌రెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో జీవన్‌రెడ్డిని బుజ్జగించే పనిలో పడింది కాంగ్రెస్ అధిష్టానం. మండలి ఛైర్మన్‌ను చేస్తామని బేరానికి దిగింది. సంజయ్ చేరికపై కాంగ్రెస్ శ్రేణుల్లోనూ తీవ్ర అసహనం ఉంది. జీవన్‌రెడ్డి ఇంటికి కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. అటు కార్యకర్తలు, ఇటు అధిష్టానంతో చర్చల అనంతరం జీవన్‌రెడ్డి ప్రెస్‌ మీట్ పెట్టి తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అధిష్టానం బుజ్జగింపులకు జీవన్‌రెడ్డి తలొగ్గుతారా, లేక రాజీనామా చేస్తారా అనేది ఉత్కంఠగా మారింది.

First Published:  24 Jun 2024 6:48 AM GMT
Next Story