Telugu Global
Telangana

'జనతాకా మూడ్' సర్వే.. తెలంగాణలో అధికారం ఎవరిదంటే..?

ఆషామాషీగా ఈ సర్వే జరగలేదు. పక్కాగా ప్రశ్నావళి రూపొందించి లక్షా 20వేలమంది నుంచి సమాచారం సేకరించింది. సెప్టెంబర్-1 నుంచి అక్టోబర్ 20 మధ్య కాలంలో.. అంటే ప్రస్తుతం ప్రజల మూడ్ ఎలా ఉంది అనే విషయాన్ని 'జనతాకా మూడ్' అంచనా వేసింది.

జనతాకా మూడ్ సర్వే.. తెలంగాణలో అధికారం ఎవరిదంటే..?
X

ఎన్నికల వేళ రకరకాల సర్వేలు జనాల్లోకి వస్తున్నాయి. వాటిలో ఏది నిజం, ఏది అబద్ధం, ఏది ఎవరి పక్షం అనేది తేలడంలేదు. అనుకూల మీడియాలతో ఎవరికి వారే సర్వేలు చేయించుకుంటున్నారు. అయితే 'జనతాకా మూడ్' సంస్థ తాజాగా సర్వే చేపట్టింది. ఆషామాషీగా ఈ సర్వే జరగలేదు. పక్కాగా ప్రశ్నావళి రూపొందించి లక్షా 20వేలమంది నుంచి సమాచారం సేకరించింది. సెప్టెంబర్-1 నుంచి అక్టోబర్ 20 మధ్య కాలంలో.. అంటే ప్రస్తుతం ప్రజల మూడ్ ఎలా ఉంది అనే విషయాన్ని 'జనతాకా మూడ్' అంచనా వేసింది.

తెలంగాణలో బీఆర్ఎస్ దే మూడోసారి అధికారం అని 'జనతాకా మూడ్' సంస్థ తేల్చి చెబుతోంది. బీఆర్ఎస్ కు 72నుంచి 75సీట్లు వస్తాయని అంచనా వేసింది. కాంగ్రెస్ కు 31నుంచి 36 సీట్లు, ఎంఐఎం కు 6నుంచి 7 సీట్లు, బీజేపీకి 4నుంచి 6 సీట్లు రావొచ్చని తేల్చింది. ఇక ఓట్ షేర్ విషయానికొస్తే 41శాతం మంది ప్రజలు బీఆర్ఎస్ కి మద్దతిస్తుండగా, కాంగ్రెస్ 34శాతం ప్రజల మద్దతు సంపాదించగలిగిందని ఈ సర్వే తేల్చింది. మూడో స్థానంలో ఉన్న బీజేపీ 14శాతం మంది ప్రజల మద్దతు పొందే అవకాశం ఉంది, ఎంఐఎంకు 3శాతం మంది ప్రజలు మద్దతు తెలుపుతున్నారు.




18చోట్ల హోరాహోరీ..

మొత్తం 119 స్థానాల్లో ఈ సర్వే జరుగగా 18 చోట్ల గట్టి పోటీ ఉంటుందని సర్వే సారాంశం. గట్టి పోటీ ఉన్న 18 స్థానాల్లో బీఆర్ఎస్ 10చోట్ల విజేతగా నిలుస్తుందని అంచనా. మిగతా 8 సీట్లలో కాంగ్రెస్, బీజేపీకి చెరో 4 స్థానాలు దక్కే అవకాశముంది.



బీఆర్ఎస్ బలం కేసీఆరే..

వరుసగా రెండు దఫాలు బీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో కచ్చితంగా వ్యతిరేక ఓటు ప్రభావం ఎన్నికల్లో ఉంటుందని అంటున్నారు. అయితే సీఎం కేసీఆరే బీఆర్ఎస్ కి ప్రధాన బలంగా మారారు. కేసీఆర్ పాలనకు మంచి మార్కులు పడటమే కాదు.. ఇతర పార్టీల్లో సీఎం అభ్యర్థి అని చెప్పుకోడానికి ఎవరూ లేరు. దీంతో కేసీఆర్ కి, బీఆర్ఎస్ కి తిరుగు లేకుండా పోయింది.

బీఆర్ఎస్ మేనిఫెస్టో సంచలనం..

కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల ప్రకటన తర్వాత ప్రజలు ఒకింత అటువైపు మొగ్గు చూపినా, బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల తర్వాత ఆ ప్రభావం అస్సలు కనిపించలేదు. బీఆర్ఎస్ మేనిఫెస్టోని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. మేనిఫెస్టో హామీలు నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ ఇతర రాష్ట్రాల్లో చేసిన జిమ్మిక్కులు కూడా తెలంగాణ ప్రజలకు అర్థమవుతున్నాయి. అందుకే బీఆర్ఎస్ మేనిఫెస్టో పైచేయి సాధించిందని 'జనతాకా మూడ్' సర్వే చెబుతోంది.

బీజేపీ పరిస్థితి ఏంటి..?

బీజేపీకి 14 శాతం ఓట్ షేర్ ఉన్నా కూడా ఆ పార్టీ కేవలం నాలుగు స్థానాల్లోనే గెలిచే అవకాశాలున్నాయని సర్వే చెబుతోంది. కోరుట్ల, బోథ్, కరీంనగర్, హుజూరాబాద్ స్థానాలు బీఆర్ఎస్ కి కీలకం అని తేలింది. కమలదళంలో గ్రూపు రాజకీయాలు ఆ పార్టీకి ఇబ్బందిగా మారాయని అంటున్నారు.

First Published:  1 Nov 2023 1:10 PM IST
Next Story