సికింద్రాబాద్ లో జన్మభూమి ఎక్స్‌ప్రెస్ స్టాప్ రద్దు
ఏప్రిల్ 25 నుంచి లింగం-చర్లపల్లి మీదుగా వెళ్లనున్నజన్మభూమి ఎక్స్‌ప్రెస్
BY Raju Asari13 March 2025 10:36 AM IST

X
Raju Asari Updated On: 13 March 2025 10:36 AM IST
ఏప్రిల్ 25 నుంచి సికింద్రాబాద్లో జన్మభూమి ఎక్స్‌ప్రెస్ స్టాప్‌ను రద్దు చేస్తున్నారు. విశాఖ-లింగంపల్లి-విశాఖ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ప్రయాణ మార్గాన్ని చర్లపల్లి-అమ్మగూడ-సనత్‌నగర్ మీదుగా శాశ్వత ప్రాతిపదికన దారి మళ్లీస్తున్నారు. ప్రతిరోజు విశాఖ నుంచి లింగంపల్లికి ఈ ఎక్స్‌ప్రెస్ నడుస్తున్నది. ఏప్రిల్ 25 నుంచి లింగం-చర్లపల్లి మీదుగా వెళ్లనున్నది. ఆ రోజు నుంచి సికింద్రాబాద్, బేగంపేట స్టేషన్ల వైపు వెళ్లదని వాల్తేర్ సీనియర్ డీసీఎం సందీప్ తెలిపారు.
Next Story