ఎస్ఐ దంపతుల ఆత్మహత్య.. - తొలుత భార్య.. గంటల వ్యవధిలోనే భర్త
ఎస్ఐ శ్రీనివాస్ గత ఎనిమిదేళ్లుగా జనగామలో విధులు నిర్వహిస్తున్నారు. శ్రీనివాస్ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారు ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నారు.
ఎస్ఐ దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన జనగామలో గురువారం జరిగింది. తొలుత భార్య ఉరి వేసుకొని చనిపోగా.. ఆ ఘటనను తట్టుకోలేకపోయిన భర్త కొద్ది గంటల వ్యవధిలోనే రివాల్వర్‌తో కాల్చుకుని మృతిచెందారు. ఎస్ఐ మృతిచెందిన సమయంలో ఉన్నతాధికారులు ఆయన ఇంట్లోనే ఉండటం గమనార్హం.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జనగామ ఎస్ఐ కాకర్ల శ్రీనివాస్ భార్య స్వరూప గురువారం తెల్లవారుజామున బాత్‌రూమ్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉదయం నిద్ర లేచిన తర్వాత భార్య మృతిచెందిన విషయం శ్రీనివాస్ గుర్తించారు. సమాచారం అందుకున్న బంధువులు, కుటుంబ సభ్యులు ఘటనాస్థలికి చేరుకున్నారు.
ఏసీపీ దేవేందర్‌రెడ్డి, పట్టణ ఇన్‌చార్జి సీఐ నాగబాబు కూడా ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. భార్య మృతికి గల కారణాలను ఎస్ఐ శ్రీనివాస్‌ని అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఎస్ఐ శ్రీనివాస్ బాత్‌రూమ్‌కు వెళ్లి.. తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన సమయంలో ఉన్నతాధికారులు ఇంట్లోనే ఉండటం గమనార్హం.
ఎస్ఐ శ్రీనివాస్ గత ఎనిమిదేళ్లుగా జనగామలో విధులు నిర్వహిస్తున్నారు. శ్రీనివాస్ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారు ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఎస్ఐ శ్రీనివాస్ దంపతులు మాత్రమే ఇక్కడ ఉంటున్నారు. బుధవారం రాత్రి దంపతులిద్దరి మధ్య కుటుంబ, ఆర్థిక సంబంధ విషయాలపై గొడవ జరిగినట్టు తెలిసిందని డీసీపీ పి.సీతారామ్ వెల్లడించారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆయన తెలిపారు.