Telugu Global
Telangana

మరో వికెట్ డౌన్.. కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే సంజయ్

2018, 23 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డిపై వరుసగా రెండుసార్లు విజయం సాధించారు సంజయ్. ఎమ్మెల్సీ కవితకు సన్నిహితుడిగా సంజయ్‌కి పేరుంది.

మరో వికెట్ డౌన్.. కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే సంజయ్
X

ఆపరేషన్ ఆకర్ష్‌ను స్పీడప్ చేసింది కాంగ్రెస్. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి చేరిక షాక్ నుంచి BRS తేరుకునేలోపే మరో ఎమ్మెల్యేకు కాంగ్రెస్ కండువా కప్పారు తెలంగాణ సీఎం రేవంత్.

తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కారు దిగారు. దీంతో BRS నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య ఐదుకు చేరింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో డాక్టర్ సంజయ్ పార్టీని వీడటం BRSకు పెద్ద షాక్. 2018, 23 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డిపై వరుసగా రెండుసార్లు విజయం సాధించారు సంజయ్. ఎమ్మెల్సీ కవితకు సన్నిహితుడిగా సంజయ్‌కి పేరుంది. 2018లో సంజయ్‌ని రాజకీయాల్లోకి తీసుకువచ్చిన కవిత.. దగ్గరుండి గెలిపించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 5 అసెంబ్లీ స్థానాల్లో BRS విజయం సాధించింది. జిల్లాలో మరికొంత మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో BRS 39 స్థానాల్లో విజయం సాధించగా ఇప్పటివరకు ఐదుగురు ఎమ్మెల్యేలు హస్తం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

First Published:  24 Jun 2024 2:37 AM GMT
Next Story