Telugu Global
Telangana

కేసీఆర్‌ కాదు.. ప్రతిపక్ష నేతగా ఆయనే.!

కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఫోకస్‌ చేస్తారని, అసెంబ్లీకి వచ్చే అవకాశాలు తక్కువ అన్న ప్రచారం కూడా జరుగుతోంది. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తారని సమాచారం.

కేసీఆర్‌ కాదు.. ప్రతిపక్ష నేతగా ఆయనే.!
X

తెలంగాణ సీఎం ఎవరన్నదానిపై సస్పెన్స్ వీడింది. రేవంత్ రెడ్డే సీఎం అభ్య‌ర్థిగా ఆ పార్టీ హైక‌మాండ్ ప్ర‌క‌టించింది. అయితే ఇప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్షనేతగా వ్యవహరించేది ఎవరనేది ఆసక్తికరంగా మారింది. వచ్చే వారం ప్రతిపక్షనేత పేరును బీఆర్ఎస్ ప్రకటిస్తుందని సమాచారం.

గజ్వేల్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన కేసీఆర్.. ప్రతిపక్ష నేతగా వ్యవహరించేందుకు సుముఖంగా లేరని తెలుస్తోంది. ఈ బాధ్యతను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ లేదా సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ రావుకు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. ప్రతిపక్ష నేత హోదాను దళితుడు, సీనియర్ నేతగా పేరున్న కడియం శ్రీహరికి అప్పగించే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. 2004లో టీఆర్ఎస్ ఎల్పీ లీడర్‌గా విజయరామరావు వ్యవహరించారు. తర్వాత 2009లో ఈటల రాజేందర్ టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆ రెండు సందర్భాల్లోనూ కేసీఆర్ కరీంనగర్‌, మహబూబ్‌నగర్ స్థానాల నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2009లో కేటీఆర్ ఫస్ట్ టైమ్‌ అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఫోకస్‌ చేస్తారని, అసెంబ్లీకి వచ్చే అవకాశాలు తక్కువ అన్న ప్రచారం కూడా జరుగుతోంది. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తారని సమాచారం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ పరిధిలోని మెజార్టీ స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. గెలిచిన ఎమ్మెల్యేలతో ఇటీవల ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో సమావేశమైన కేసీఆర్.. త్వరలోనే తెలంగాణ భవన్‌లో సమావేశం నిర్వహించి ప్రతిపక్ష నేతను ఎన్నుకుందామని చెప్పారు.

First Published:  6 Dec 2023 6:35 AM GMT
Next Story