Telugu Global
Telangana

దేశం ఏమైనా పర్వాలేదు బీజేపీకి రాజకీయాలే ముఖ్యం... కేటీఆర్

''బీజేపీకి దేశ ఆర్థిక పరిస్థితి కంటే రాజ‌కీయమే ప్రాధాన్య‌మైంది. రాజ‌కీయానికి ప్రాధాన్య‌మిస్తే ఫ‌లితాలు ఇలాగే ఉంటాయి. టెలిప్రాంప్ట‌ర్ చూసి ప్ర‌సంగించ‌డం సులువే. కానీ ప‌టిష్ట ప్ర‌య‌త్నాలు లేక‌పోతే ఫ‌లితాలు రావ‌డం క‌ష్టం'' అని కేటీఆర్ పేర్కొన్నారు.

దేశం ఏమైనా పర్వాలేదు బీజేపీకి రాజకీయాలే ముఖ్యం... కేటీఆర్
X

చైనా నుంచి వైదొలిగిన వ్యాపారాలను ఆకర్షించడం లో భారత్ విఫలమైందంటూ పార్లమెంటరీ ప్యానెల్ పార్లమెంటుకు సమర్పించిన‌ నివేదికపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. బీజేపీకి దేశ ఆర్థిక పరిస్థితికన్నా రాజకీయాలే ముఖ్యమని ఆయన మండిపడ్డారు.

కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ నేతృత్వంలోని కమిటీ ఈ నివేదికను సమర్పించింది. పెట్టుబడిదారులకు సానుకూల వాతావరణం సృష్టించడంలో భారత్ విఫలమైందని నివేదిక పేర్కొంది. అదే సమయంలో ఈ అవకాశాన్ని ఆగ్నేయాసియా దేశాలైన వియత్నాం, థాయ్‌లాండ్, కంబోడియా, మలేషియాలు ఉపయోగించుకొని లబ్ధిపొందాయని పేర్కొంది.

బల్క్ డ్రగ్స్,యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ ల‌ కోసం మనం చైనా పై ఆధారపడటం వల్ల ఔషధ రంగంలో భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీపడలేకపోతున్నదని నివేదిక తెలిపింది. లడఖ్‌లోని గాల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన హింసాత్మక ఘర్షణల్లో 20 మంది భారతీయ సైనికులు మరణించిన 2020 సమయంలో మనం చైనా నుండి దిగుమతులు పెంచుకున్నాం అని నివేదిక పేర్కొంది.

ఈ నివేదికపై కేటీఆర్ ట్వీట్ చేస్తూ, ''బీజేపీకి దేశ ఆర్థిక పరిస్థితి కంటే రాజ‌కీయమే ప్రాధాన్య‌మైంది. రాజ‌కీయానికి ప్రాధాన్య‌మిస్తే ఫ‌లితాలు ఇలాగే ఉంటాయి. టెలిప్రాంప్ట‌ర్ చూసి ప్ర‌సంగించ‌డం సులువే. కానీ ప‌టిష్ట ప్ర‌య‌త్నాలు లేక‌పోతే ఫ‌లితాలు రావ‌డం క‌ష్టం'' అని కేటీఆర్ పేర్కొన్నారు.

First Published:  25 March 2023 10:17 AM
Next Story