ఇస్రో మరో ఘనత.. SSLV-D3 ప్రయోగం విజయవంతం
ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ శాస్త్రవేత్తలతో కలిసి ప్రయోగాన్ని పర్యవేక్షించారు. మొత్తం 17 నిమిషాల పాటు ప్రయోగం సాగింది. EOS శాటిలైట్‌ను యూఆర్ రావు శాటిలైట్ సెంటర్‌లో అభివృద్ధి చేశారు.
వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ISRO మరో ఘనత సాధించింది. ఇస్రో చేపట్టిన SSLV-D3 ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి SSLV-D3 రాకెట్ ద్వారా 175 కేజీల EOS-08 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. విపత్తు నిర్వహణలో సమాచారం ఇచ్చేందుకు ఈ ఉపగ్రహం ఉపయోగపడనుంది. పర్యావరణం, ప్రకృతి విపత్తులు, అగ్ని పర్వతాలపై ఈ ఉపగ్రహం పర్యవేక్షణ ఉంటుంది.
ఉదయం 9.17 గంటలకు రాకెట్‌ను నింగిలోకి లాంచ్ చేశారు. ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ శాస్త్రవేత్తలతో కలిసి ప్రయోగాన్ని పర్యవేక్షించారు. మొత్తం 17 నిమిషాల పాటు ప్రయోగం సాగింది. EOS శాటిలైట్‌ను యూఆర్ రావు శాటిలైట్ సెంటర్‌లో అభివృద్ధి చేశారు. ఈ ఉపగ్రహంలో ఉండే ఎలక్ట్రో ఆప్టికల్.. ఇన్ఫ్రారెడ్ పేలోడ్ మిడ్ వేవ్, లాంగ్ వేవ్ చిత్రాలను తీస్తుంది. ఈ ఉపగ్రహం ఏడాది పాటు పని చేయనుంది.