షర్మిల విషయంలో కూడా ఇదే జరుగుతోందా..?
సీన్ కట్ చేస్తే తర్వాత జరిగిన ఎన్నికల్లో పోటీచేసిన రెండు నియోజకవర్గాల్లోను పవన్ ఓడిపోయారు. పార్టీకి చాలాచోట్ల అసలు డిపాజిట్లే దక్కలేదు. ఎన్నికలకు ముందు సీఎం సీఎం అని అరచిన అభిమానులు తర్వాత ఎన్నికల్లో ఏమైపోయారో అర్ధంకాలేదు
సేమ్ టు సేమ్ వైఎస్సార్టీపీ అధినేత వైఎస్ షర్మిల విషయంలో కూడా ఇదే జరుగుతోంది. అంటే ఒకప్పుడు, ఇప్పుడు కూడా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు జరిగినట్లే జరుగుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే ఖమ్మం జిల్లా పాలేరులో పార్టీ ఆఫీసు, గెస్ట్ హౌస్ నిర్మాణానికి శంకుస్ధాపన జరిగింది. ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు షర్మిల పాలేరుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం సీఎం అంటూ అభిమానులు నానా రచ్చచేశారు.
కార్యక్రమం జరుగుతున్నంతసేపు 'కాబోయే సీఎం షర్మిల.. కాబోయే సీఎం షర్మిల' అంటూ నానా గొడవ చేశారు. షర్మిల కూడా వాళ్ళని ఆపినట్లు కనబడలేదు. అంటే తనను కొంతమంది సీఎం అని అంటుంటే షర్మిల బాగానే ఎంజాయ్ చేస్తున్నట్లుంది. పాలేరులోనే కాదు ఈమధ్య షర్మిల పర్యటనల్లో అభిమానులు ఇలాగే గోలచేస్తున్నారు. ఇదే విధంగా పవన్ కూడా జరిగింది. పవన్ ఎక్కడ పర్యటించినా సీఎం సీఎం అంటు నానా గోలచేసేవారు అభిమానులు. నిజంగానే తాను సీఎం అవబోతున్నట్లు పవన్ ఏదేదో ఊహించేసుకున్నారు.
సీన్ కట్ చేస్తే తర్వాత జరిగిన ఎన్నికల్లో పోటీచేసిన రెండు నియోజకవర్గాల్లోను పవన్ ఓడిపోయారు. పార్టీకి చాలాచోట్ల అసలు డిపాజిట్లే దక్కలేదు. ఎన్నికలకు ముందు సీఎం సీఎం అని అరచిన అభిమానులు తర్వాత ఎన్నికల్లో ఏమైపోయారో అర్ధంకాలేదు. తీరా మొత్తం విచారిస్తే అర్ధమైందేమంటే పవన్ దగ్గర సీఎం సీఎం అని అరిచిన అభిమానులంతా ఎన్నికల్లో వైసీపీకి ఓట్లేశారని. 'పవన్ అంటే ప్రాణమిస్తాం ఓట్లు మాత్రం జగన్ కే వేస్తాం' అన్నట్లుగా చెప్పారట అభిమానులు.
ఇదే విషయాన్ని పవనే స్వయంగా బహిరంగసభల్లోనే చెప్పారు. ఇప్పుడు షర్మిల పరిస్ధితి కూడా అలాగే తయారవుతుందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇద్దరు పార్టీని నిర్మించుకోలేదు. గ్రామం నుండి రాష్ట్ర కమిటీలే వేసుకోలేదు. పార్టీలో గట్టి నేతలే లేరు. రేపటి ఎన్నికల్లో పార్టీ తరపున పనిచేసి జనాలతో ఓట్లేయించే యంత్రాంగం లేదు. అధికారంలోకి వస్తే ఏమిచేస్తామనే స్పష్టమైన హామీలు లేవు. ఎంతసేపు ఏపీలో జగన్మోహన్ రెడ్డిని తెలంగాణాలో కేసీయార్ ను తిట్టడమే టార్గెట్ గా పెట్టుకున్నారిద్దరు. పార్టీకి ఏమీలేకపోయినా ఇద్దరు సీఎంలైపోదామని ఎలా అనుకుంటున్నారో ఏమో ?