Telugu Global
Telangana

పచ్చని పొలాల్లో చిచ్చుపెట్టడమే ప్రజాపాలనా?

పాలన గాలికి వదిలి అక్రమ కేసులతో రాజకీయ కక్ష తీర్చుకోవడం సిగ్గుచేటన్న మాజీ మంత్రి

పచ్చని పొలాల్లో చిచ్చుపెట్టడమే ప్రజాపాలనా?
X

కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డిని అదుపులోకి తీసుకోవడాన్ని Former Minister Harish Rao ఖండించారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్‌' వేదికగా పోస్టు చేశారు. పాలన గాలికి వదిలి అక్రమ కేసులతో రాజకీయ కక్ష తీర్చుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. పచ్చని పొలాల్లో ఫార్మాసిటీ పేరిట చిచ్చు పెట్టడమేనా ప్రజాపాలన అని ప్రశ్నించారు. ప్రశ్నించే గొంతులను అక్రమ అరెస్టులు, కేసులతో అణిచివేయలరన్నారు. ప్రజల తరఫున ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని హరీశ్‌ పేర్కొన్నారు.

First Published:  13 Nov 2024 12:57 PM IST
Next Story