Telugu Global
Telangana

కాంగ్రెస్‌ వైపు రాములమ్మ అడుగులు..!

బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై విజయశాంతి అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. కొంతకాలంగా విజయశాంతి పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవల బీజేపీ తీసుకున్న కొన్ని నిర్ణయాలను ఆమె బహిరంగంగానే వ్యతిరేకించారు.

కాంగ్రెస్‌ వైపు రాములమ్మ అడుగులు..!
X

ఫైర్‌ బ్రాండ్‌, లేడి అమితాబ్‌ విజయశాంతి మళ్లీ పాత గూటికి చేరనున్నారా..? అంటే అవుననే సమాధానమే వస్తోంది. కాంగ్రెస్‌ CWC సమావేశాల సందర్భంగా విజయశాంతి చేసిన ట్వీట్‌ ఈ చర్చకు దారి తీసింది. ఈ ట్వీట్‌లో తెలంగాణ ఇచ్చినందుకు సోనియాగాంధీని అభిమానిస్తామని పేర్కొన్నారు విజయశాంతి. బీఆర్ఎస్, MIM ఒకటేనంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలను విజయశాంతి సమర్థించారు. దీంతో విజయశాంతి కాంగ్రెస్‌ పార్టీలో చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది.


ఇటీవల బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై విజయశాంతి అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. కొంతకాలంగా విజయశాంతి పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవల బీజేపీ తీసుకున్న కొన్ని నిర్ణయాలను ఆమె బహిరంగంగానే వ్యతిరేకించారు. బండి సంజయ్‌ని అధ్యక్ష పదవి నుంచి తొలగించడాన్ని విజయశాంతి తప్పు పట్టారు. ఇక మణిపూర్ అంశంలోనూ పార్టీ లైన్‌కు వ్యతిరేకంగా స్పందించారు. కిషన్ రెడ్డి రాష్ట్ర బాధ్యతలు స్వీకరించే కార్యక్రమానికి మాజీ సీఎం కిరణ్‌ కుమార్ రెడ్డిని ఆహ్వానించడంపైనా ఆమె తీవ్రంగా స్పందించారు. ఇక పార్టీ కార్యక్రమాలకు తనకు ఆహ్వానం అందడం లేదన్న అసంతృత్తిలో రాములమ్మ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక ఇటీవల జిట్టా బాలకృష్ణా రెడ్డి, యెన్నం శ్రీనివాస రెడ్డి బీజేపీని వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ నేపథ్యంలో రాములమ్మ సైతం వారి బాటలోనే నడవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

First Published:  19 Sept 2023 8:30 AM IST
Next Story