Telugu Global
Telangana

IPSల బదిలీ.. హైదరాబాద్‌ సీపీ ఎవరంటే..?

రాచకొండ పోలీస్ కమిషనర్‌గా ప్రభుత్వం సుధీర్ బాబును నియమించింది. గతంలో సుధీర్ బాబు రాచకొండ అడిషనల్ పోలీస్ కమిషనర్‌గా పనిచేశారు.

IPSల బదిలీ.. హైదరాబాద్‌ సీపీ ఎవరంటే..?
X

తెలంగాణలో ఐదుగురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా 1994 బ్యాచ్‌కు చెందిన కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డిని నియమించారు. ఇప్పటివరకు హైదరాబాద్‌ సీపీగా ఉన్న సందీప్‌ శాండిల్యను యాంటీ నార్కొటిక్‌ వింగ్‌ డైరెక్టర్‌గా నియ‌మించారు.

రాచకొండ పోలీస్ కమిషనర్‌గా ప్రభుత్వం సుధీర్ బాబును నియమించింది. గతంలో సుధీర్ బాబు రాచకొండ అడిషనల్ పోలీస్ కమిషనర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఈయన ట్రాఫిక్ జాయింట్ కమిషనర్‌గా హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు రాచకొండ పోలీస్ కమిషనర్‌గా ఉన్న దేవేంద్ర చౌహాన్‌ను డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

సైబరాబాద్‌ సీపీగా అవినాష్‌ మహంతిని నియమించింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటివరకు సైబరాబాద్‌ సీపీగా ఉన్న‌ స్టీఫెన్‌ రవీంద్రను డీజీ ఆఫీస్‌కు అటాచ్‌ చేశారు. ఐపీఎస్‌ల బదిలీపై తెలంగాణ డీజీపీ రవి గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.

First Published:  12 Dec 2023 2:53 PM IST
Next Story