హెచ్‌సీఏలో అక్రమాలపై విచారణ చేయండి
విజిలెన్స్ కు ఎంపీ చామల కంప్లైంట్
BY Naveen Kamera23 Sept 2024 3:54 PM IST

X
Naveen Kamera Updated On: 23 Sept 2024 3:54 PM IST
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో అక్రమాలపై విచారణ చేయాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్‌మెంట్ ఏడీజీకి కంప్లైంట్ చేశారు. హెచ్‌సీఏలో ట్రాన్స్‌పోర్ట్, క్యాటరింగ్ టెండర్లలో అక్రమాలు జరిగాయనే అనుమానాలున్నాయని తెలిపారు. ప్రెసిడెంట్, సెక్రటరీ చేతుల్లోనే అధికారాలు కేంద్రీకరించారని తెలిపారు. టెండర్ లేకుండానే ఐపీఎల్ కాంట్రాక్టులు ఇచ్చారని, వాటికి అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదని వివరించారు. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ మినిట్స్ ను సభ్యులకు పంపలేదని వివరించారు. బ్యాలెన్స్ షీట్, బడ్జెట్ స్టేట్ మెంట్ సహా అనేక అవకతవకలు జరిగాయనే అనుమానాలున్నాయని తెలిపారు. వీటిపై సమగ్ర విచారణ చేపట్టి అక్రమాలను నిగ్గు తేల్చాలని విజ్ఞప్తి చేశారు.
Next Story