తెలంగాణలో పెట్టుబడులు: కేటీఆర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందానికి బ్రిటన్ లో ఘనస్వాగతం
మూడు రోజుల పర్యటనలో, తెలంగాణలో ఉన్న పెట్టుబడి అనుకూల వాతావరణం, వివిధ పరిశ్రమ రంగాలలో రాష్ట్రం సాధిస్తున్న అద్భుతమైన పురోగతిని కేటీఆర్ పారిశ్రామికవేత్తలు, వ్యాపార సంఘాలకు వివరిస్తారు.
రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం యునైటెడ్ కింగ్‌డమ్ పర్యటనకు వెళ్ళారు.లండన్‌లోని హీత్రూ విమానాశ్రయంలో దిగిన మంత్రికి అక్కడి ఎన్నారై సంఘాలు ఘనస్వాగతం పలికాయి
మూడు రోజుల పర్యటనలో, తెలంగాణలో ఉన్న పెట్టుబడి అనుకూల వాతావరణం, వివిధ పరిశ్రమ రంగాలలో రాష్ట్రం సాధిస్తున్న అద్భుతమైన పురోగతిని కేటీఆర్ పారిశ్రామికవేత్తలు, వ్యాపార సంఘాలకు వివరిస్తారు.
‘ఐడియాస్ ఫర్ ఇండియా కాన్ఫరెన్స్ -2023’లో కూడా ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. ‘ఐడియాస్ ఫర్ ఇండియా’ కాన్ఫరెన్స్ రెండవ ఎడిషన్‌లో UK, యూరప్, భారతదేశానికి చెందిన వ్యాపార, పరిశ్రమ, మంత్రులను ఒకచోట చేర్చి భారతదేశం అభివృద్ధి గురించి చర్చించనున్నట్లు అధికారులు తెలిపారు.
NRIs gave a warm reception to Telangana IT, Industries and Municipal Administration Minister @KTRBRS at Heathrow Airport, London.
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) May 10, 2023
Minister KTR is leading a delegation from Telangana with the aim of attracting investments to the state. pic.twitter.com/40kJVh8ktq