బాణసంచాతో గాయాలు.. ఆస్పత్రిలో చేరిన బాధితులు
సరోజినిదేవి కంటి ఆస్పత్రిలో ఇప్పటివరకు 45 కేసులు నమోదు
BY Raju Asari1 Nov 2024 10:37 AM IST
X
Raju Asari Updated On: 1 Nov 2024 10:37 AM IST
హైదరాబాద్ సరోజినిదేవి కంటి ఆస్పత్రికి బాణసంచా బాధితులు క్యూకట్టారు. గాయాలతో 45 మంది బాధితులు చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చారు. వీరిలో 34 మందికి స్వల్ప గాయాలు, 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. డాక్టర్లు ఆస్పత్రిలో క్షతగాత్రులకు చికిత్స అందించారు.
సరోజినిదేవి కంటి ఆస్పత్రిలో రోగులకు చికిత్స జరుగుతున్నది. ఇప్పటివరకు 47మంది ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చారు. అయితే వారిలో ఒక్కరికీ శస్త్ర చికిత్స అవసరం లేదని, మెడికల్ అబ్జర్వేషన్‌లో ఉంచుతామని డాకర్లు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి కేసులు తగ్గాయని డాక్టర్లు చప్పారు. పిల్లలు టపాసులు కాల్చే సమయంలో పెద్దవాళ్లు దగ్గరగా ఉండాలని సరోజినిదేవి కంటి ఆస్పత్రి డాక్టర్లు సూచిస్తున్నారు.
Next Story