రాష్ట్రంలో ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన నడుస్తుంది : ఎమ్మెల్సీ కవిత
తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన కాదు..ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన నడుస్తుందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు.
BY Vamshi Kotas5 Dec 2024 3:19 PM IST
X
Vamshi Kotas Updated On: 5 Dec 2024 3:19 PM IST
తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన కాదు..ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన నడుస్తుందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. బీఆర్‌ఎస్ నేతల అరెస్టులపై కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ఆమె అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కవిత పేర్కొన్నారు.
ప్రభుత్వ లోపాలను గురుకుల విద్యార్థుల బాధలను ప్రశ్నించిన కేసులు పెడుతున్నారని కవిత వాపోయారు. అక్రమంగా అరెస్టు చేసిన మాజీ మంత్రులు, హరీశ్ రావు జగదీశ్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకుల అరెస్టు అప్రజాస్వామికమని తక్షణం వారిని విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీని కవిత డిమాండ్ చేశారు.
Next Story