మిడ్ మానేరు నిర్వాసితులకు ఇందిరమ్మ ఇండ్లు
4,696 మందికి రూ.5 లక్షల చొప్పున సాయం
BY Naveen Kamera17 Nov 2024 11:19 AM IST
X
Naveen Kamera Updated On: 17 Nov 2024 11:19 AM IST
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరు రిజర్వాయర్ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ రిజర్వాయర్ నిర్మాణంలో12 గ్రామాల్లో 10,683 కుటుంబాలు నిర్వాసితులయ్యాయి. వారిలో 5,987 కుటుంబాలకు అప్పటి ప్రభుత్వం పునరావాస కాలనీల్లో ఇండ్లు నిర్మించి ఇచ్చింది. మిగిలిన 4,696 కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఒక్కో కుటుంబం ఇల్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా ఇందిరమ్మ ఇండ్లను మిడ్ మానేరు నిర్వాసితులకే మంజూరు చేసింది. ఈ స్కీం ఇంకా రాష్ట్రంలో ప్రారంభం కాలేదు. దీపావళికే ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పినా ఇప్పటి వరకు దానికి సంబంధించిన చర్యలు చేపట్టలేదు.
Next Story