Telugu Global
Telangana

కొద్ది గంటల్ల ఫార్ములా ఇ రేస్ స్టార్ట్ ... స్వంత గడ్డపై తన శక్తి సామర్ద్యాలు చూపేందుకు తహతహలాడుతున్న హైదరాబాద్ రేసర్

హైదరాబాద్ హుస్సేన్ సాగర్ ఒడ్డున మరి కొద్ది సేపట్లో ఫార్ములా ఇ రేస్ ప్రారంభం కాబోతుంది. తన స్వంత గడ్డపై రేస్ లో పాల్గొంటున్నందుకు హైదరాబాద్ రేసర్ అనిందితా రెడ్డి గర్వంగా ఉందంటున్నారు.

కొద్ది గంటల్ల ఫార్ములా ఇ రేస్ స్టార్ట్ ... స్వంత గడ్డపై తన శక్తి సామర్ద్యాలు చూపేందుకు తహతహలాడుతున్న  హైదరాబాద్ రేసర్
X

మరి కొద్ది గంటల్లో హైదరాబాద్ లో ఇండియన్ రేసింగ్ లీగ్ ఫార్ములా ఇ రేస్ ప్రారంభం కానుంది. హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్ స్ట్రీట్ సర్క్యూట్ లో హైదరాబాద్, గోవా, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ జట్లు పోటీ పడుతున్నాయి.ఈ పోటీలో పాల్గొంటున్న హైదరాబాద్ రేసర్ అనిందితా రెడ్డి తన స్వంత గడ్డపై పోటీ పడుతున్నందుకు ఉత్సాహంగా ఉన్నారు. తన స్వంత నగరం ఫ్యాన్స్ ముందు తన శక్తి సామర్ద్యాలు చూపేందుకు తహతహలాడుతున్నారు.

"మోటార్‌స్పోర్ట్ హైదరాబాద్‌కు రావడం అద్భుతం. ఇది ఖచ్చితంగా సరైన దిశలో పడుతున్న ఒక ముందడుగు. ఇది స్ట్రీట్ సర్క్యూట్ కావడం వల్ల మరింత ఉత్తేజాన్నిస్తుంది. హైదరాబాద్‌లో పూర్తి సర్క్యూట్‌ను నిర్మించాలని కోరుకుంటున్నాను' అని 32 ఏళ్ల రేసర్ అనిందితా రెడ్డి అన్నారు

"ఇది ప్రపంచంలోనే మొదటి తరహా ఫార్మాట్. ముఖ్యంగా రేసింగ్‌కు ఆదరణ లేని భారతదేశం వంటి దేశంలో ఈ రేస్ జరగడం చాలా అవసరం. ఈ లీగ్ చూడటానికి అనేక నగరాల నుంచి అభిమానులు వస్తున్నారు. "అని అతను చెప్పాడు.

2013లో ప్రొఫెషనల్‌గా రేసింగ్‌ను ప్రారంభించిన అనిందిత్, గత సంవత్సరం ఇండియన్ టూరింగ్ కార్ రేస్‌లో విజేతగా నిలిచాడు. 2019లో X1 రేసింగ్ లీగ్‌తో పాటు 2018లో లంబోర్ఘిని సూపర్ ట్రోఫియో సిరీస్‌లో పాల్గొన్నాడు.

2017లో, అతను MRF F1600, Euro JK17 గెలుచుకున్న ఏకైక రేసర్‌గా నిలిచాడు. దాని వల్ల అతను 2017లో మోటార్‌స్పోర్ట్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును పొందారు. అతను 100 కంటే ఎక్కువ రేస్‌లు, 70 పోడియంలు(మొదటి మూడు స్థానాల్లో ఒకరుగా నిలవడం), 25 కంటే ఎక్కువ విజయాలతో పాటు ఐదు ఛాంపియన్‌షిప్ లను కూడా గెల్చుకున్నారు.

"నా ప్రయాణం ఇప్పటివరకు అద్భుతంగా ఉంది. నేను నా ప్రయాణంలో ప్రతి సంవత్సరం ఉన్నత స్థాయికి వెళ్తున్నాను. ప్రస్తుతం నా లక్ష్యం ఈ లీగ్ లో రాణించడమే. ఇది ప్రపంచంలోని అత్యుత్తమ డ్రైవర్లతో పోటీ పడటానికి, మన స్థాయి ఏంటో తెలుసుకోవడానికి అవకాశాన్ని ఇస్తుంది. నేను తదుపరి GT కార్ రేసింగ్‌లోకి వెళ్లాలనుకుంటున్నాను. "అని అతను వెల్లడించాడు.

భారతదేశపు మొట్టమొదటి ఫార్ములా ఇ రేస్‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వడం ప్రజలను ఈ క్రీడలో పాల్గొనేలా ప్రోత్సహిస్తుందని అనిందతా రెడ్డి అభిప్రాయపడ్డారు. "ఫార్ములా ఇ రేసింగ్ భారతదేశానికి, ముఖ్యంగా హైదరాబాద్‌కు రావడం గొప్ప‌ ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇది ఖచ్చితంగా దేశంలోని ఆటపై గొప్ప‌ ప్రభావాన్ని చూపుతుంది. ఇది ఇక్కడ ఈ క్రీడను మరింత ప్రాచుర్యంలోకి తీసుకవస్తుంది. "అన్నారాయన.

ఈ రోజు (శనివారం) మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు ఫార్ములా ఇ రేస్ సాగుతుంది. హుస్సేన్ సాగర్ చుట్టూ సాగే ఈ రేస్ కోసం నిపుణుల సహాయంతో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ రేసింగ్ లో కార్ల వేగం గరిష్టంగా 250 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ట్రాక్ ను అందుకు తగ్గట్టు రూపొందించారు.

First Published:  19 Nov 2022 5:42 AM GMT
Next Story