Telugu Global
Telangana

హుస్సేన్ సాగర్ తీరాన...రయ్యిమంటూ దూసుకెళ్ళిన రేస్ కార్లు

ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన కార్ రేసింగ్ ని తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ రేస్ లో 12 కార్లు పాల్గొన్నాయి. 50 శాతం దేశీయ డ్రైవర్లు, మరో 50 శాతం విదేశీ డ్రైవ‌ర్లతో సాగిన ఈ రేస్ ఫ్యాన్స్ కు ఆద్యంతం ఆసక్తి కలిగించింది.

హుస్సేన్ సాగర్ తీరాన...రయ్యిమంటూ దూసుకెళ్ళిన రేస్ కార్లు
X

భారత్ లోనే తొలిసారి హైదరాబాద్‎లోని హుస్సేన్ సాగర్ తీరంలో ఇండియన్ రేసింగ్ లీగ్ ప్రారంభమైంది.ఇండియన్ కార్ రేసింగ్ లీగ్ క్వాలిఫియర్ ను జెండా ఊపి తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

ఈ రోజు ట్రైల్ రన్ నే నిర్వహించారు. ఈ రోజు ఎలక్ట్రిక్ కార్లతో కాకుండా పెట్రోల్ కార్లతోనే ఈ రేస్ జరిగింది. రేపు కూడా పెట్రోల్ కార్లతోనే పోటీ జరుగుతోందని నిర్వాహకులు తెలిపారు.

ఈ రేసింగ్ లో 12 కార్లు పాల్గొన్నాయి. 50 శాతం దేశీయ డ్రైవర్లు, మరో 50 శాతం విదేశీ డ్రైవ‌ర్లతో సాగిన ఈ రేస్ ఫ్యాన్స్ కు ఆద్యంతం ఆసక్తి కలిగించింది. ఈ రోజు కార్లు 240 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీశాయని అదే ఎలక్ట్రిక్ కార్లయితే 320 కిలోమీటర్ల వేగంతో పరుగెడతాయని నిర్వాహకులు తెలిపారు.

రేస్ జరిగిన ట్రాక్ పై మొత్తం 18 మూలమలుపులున్నాయి. ప్రతి మూలమలుపు వద్ద అధికారులు అంబులెన్స్ లను సిద్దంగా ఉంచారు. ఈ రోజు జరిగిన రేస్ లో హైదరాబాద్, బేంగళూరు,గోవా, చెన్నై, కొచ్చి టీం లు పాల్గొన్నాయి.

రేస్ జరిగినంత సేపు మంత్రి కేటీఆర్ ఐమాక్స్ వద్ద ప్రేక్షకులతో కలిసి నిలబడే రేసును తిలకించారు. ఈ రేస్ చూడటాని వందలాది మంది అభిమానులు తరలివచ్చారు. టాలీవుడ్ హీరో నిఖిల్ కూడా ఈ రేస్ చూడడానికి వచ్చారు.

First Published:  19 Nov 2022 6:16 PM IST
Next Story