Telugu Global
Sports

నేడు హైదరాబాద్‌లో భారత్, బంగ్లా మూడో టీ 20..వీహెచ్‌పీ హెచ్చరిక

హైదరాబాద్‌లో ఉప్పల్ స్టేడియంలో ఇవాళ భారత్ - బంగ్లాదేశ్ మధ్య మూడో టీ 20 మ్యాచ్ జరగనుంది.

నేడు హైదరాబాద్‌లో భారత్, బంగ్లా మూడో టీ 20..వీహెచ్‌పీ హెచ్చరిక
X

హైదరాబాద్‌లో ఉప్పల్ స్టేడియంలో ఇవాళ భారత్ - బంగ్లాదేశ్ మధ్య మూడో టీ 20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే రెండు టీ 20ల్లో విజయం సాధించిన టీమిండియా మూడో టీ 20లో గెలిచిన సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలన్న పట్టుదలతో ఉంది. మరో వైపు .. ఈ మ్యాచ్ లోనైనా గెలిచి ఉనికి కాపాడుకోవాలని బంగ్లాదేశ్ భావిస్తోంది. ఈ క్రమంలో గురువారం హైదరాబాద్‌కు చేరుకున్న రెండు జట్టులు నిన్న ఉప్పల్ క్రీడా మైదానంలో ప్రాక్టీస్ చేశాయి. దసరా పండుగ వేళ విశ్వహిందూ పరిషత్ పరిషత్ నాయకులు భారత్, బంగ్లాదేశ్ టీ20 మ్యాచ్‌ను అడ్డుకొని తీరుతామని హెచ్చరించారు. మ్యాచ్‌లో ఎవరు గెలిచినా.. ఓడినా బాధితులు మాత్రం బంగ్లాదేశ్‌లోని హిందువులే అని పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లోని హిందువులను ప్రమాదంలోకి నెట్టొద్దని కోరారు.

తర్వాత జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని గట్టి వార్నింగ్ ఇచ్చారు. దీంతో సిటీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉప్పల్ క్రీడా మైదానం వద్ద భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. 250 మంది సెక్యూరిటీ వింగ్, 400 మంది ట్రాఫిక్ సిబ్బంది బందోబస్తులో ఉన్నారు. అంతే కాకుండా.. 1,662 మంది లా అండ్ ఆర్డర్, 14 ప్లాటూన్ల టీఎస్ఎస్పీ, ఆరు ప్లాటూన్ల సాయుధ దళాలు బందోబస్తులో ఉన్నాయి. 300 సీసీ కెమెరాలతో పర్యవేక్షణతో పాటు బాంబ్, డాగ్ స్క్వాడ్ లతో తనిఖీలు చేశామని సీపీ తెలిపారు.

First Published:  12 Oct 2024 5:56 AM GMT
Next Story