ఆకలి సూచిలో మరింత దిగజారిన భారత ర్యాంకు... వ్యంగ్యంగా స్పందించిన కేటీఆర్
ప్రపంచ ఆకలి సూచీలో మన దేశ ర్యాంకు గత ఏడాదికన్నా ఆరు ర్యాంకులు దిగజారి 121 దేశాలలో 107వ ర్యాంక్‌కు పడిపోయింది. పాకిస్థాన్ , శ్రీలంక, బంగ్లాదేశ్ , నేపాల్ లు కూడా మనకన్నా మెరుగైన పరిస్థితులో ఉన్నాయి.
ప్రపంచ ఆకలి సూచీ 2022లో భారత దేశం ర్యాంకు మరింత దిగజారింది. 121 దేశాలలో ఆరు స్థానాలు దిగజారి 107వ ర్యాంక్‌కు పడిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ మినహా దక్షిణాసియాలోని అన్ని దేశాల కంటే మన దేశం వెనుకబడి ఉంది.
దక్షిణాసియాలోని పాకిస్థాన్ 99,, శ్రీలంక64, బంగ్లాదేశ్ 84, నేపాల్ 81 , మయన్మార్ 71 స్థానాల్లో మనకన్నా ముందు నిలిచాయి.
భారత్ కంటే దిగువన ఉన్నవి జాంబియా, అప్ఘనిస్థాన్, టిమోర్ లెస్టే, గయానా బిసా, సియెర్రా లియోన్, లెసోతో తదితర దేశాలు.
మొత్తం 121 దేశాలతో ఈ సూచీ ర్యాంకుల నివేదిక విడుదలైంది. అంతర్జాతీయ ఆకలి సూచీలో దేశాల ర్యాంకు కేటాయింపునకు ప్రధానంగా చూసే అంశాలు.. పోషకాహార లేమి (కావాల్సినన్ని కేలరీలు లభించకపోవడం), చిన్నారుల మరణాలు,శారీరక వృద్ధి సరిగ్గా లేకపోవడం, బరువు తక్కువ ఉండడం.
ఆకలి సూచీలో భారతదేశం దిగజారిపోవడంపై తెలంగాణ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో స్పందించారు... "గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో భారత్ 101వ స్థానం నుంచి 107వ ర్యాంక్‌కు పడిపోయింది.ఇది NPA (నాన్ పర్ ఫార్మెన్స్ అలయమ్స్)ప్రభుత్వం సాధించిన మరో అద్భుతమైన విజయం. ఈ వైఫల్యాన్ని అంగీకరించే బదులు, బీజేపీ జోకర్లు ఈ నివేదికను భారత వ్యతిరేక నివేదిక అనే ఆరోపణలు మొదలుపెడతారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.''అని ట్వీట్ చేశారు.
Yet another day & yet another amazing achievement of NPA Govt
— KTR (@KTRTRS) October 15, 2022
India slipped from 101st to 107th rank in Global Hunger Index
Instead of accepting failure, am sure BJP jokers will dismiss the report as anti-Indian now #AchheDin https://t.co/vdMR4GUuHN