Telugu Global
Telangana

ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్: నేడు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆ‍ంక్షలు

సోమాజిగూడ నుండి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వరకు 8 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆ‍ంక్షలు ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు

ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్: నేడు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆ‍ంక్షలు
X

ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి.

సోమాజిగూడ నుండి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వరకు 8 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆ‍ంక్షలు ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు

సోమాజిగూడ, గ్రీన్ ల్యాండ్స్, బేగంపేట్, రసూల్‌పురా, సీటీవో, ఎస్‌బీహెచ్ జంక్షన్, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్ జంక్షన్, ఆలుగడ్డ బావి, మెట్టుగూడ జంక్షన్, తార్నాక, హబ్సిగూడ, ఎన్‌జీఆర్‌ఐ, ఉప్పల్ వంటి కీలక జంక్షన్‌లలో రద్దీ ఉంటుందని అందువల్ల ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజ‌లు పైన పేర్కొన్న మార్గాల్లో ప్రయాణించకుండా ఇతర మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులుసూచించారు.

కాగా, క్రికెట్ మ్యాచ్ ను దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు నాగోల్‌-రాయదుర్గం రూట్ లో అదనపు రైళ్ళనునడుపుతున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 7 నిమిషాలకు ఒక రైలు బదులు 5 నిమిషాలకు ఒక రైలు చొప్పున నడపనున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు 4 నిమిషాలకు ఒక రైలు నడుతామని మెట్రో అధికారులు ప్రకటించారు. ఉప్పల్ స్టేడియం వద్ద ఉన్న మెట్రో స్టేషన్‌లో 10 కౌంటర్లు ఏర్పాటు చేశారు.

First Published:  18 Jan 2023 2:42 AM GMT
Next Story