Telugu Global
Telangana

టీ20 రచ్చ.. జింఖానా మైదానంలో తొక్కిసలాట, ఒకరు మృతి

సికింద్రాబాద్ జింఖానా మైదానం వద్ద పరిస్థితి అదుపు తప్పింది. ఒక మహిళ చనిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈనెల 25న ఉప్పల్ స్డేడియంలో భారత్- ఆసీస్ మధ్య టీ20 మ్యాచ్ జరగనుంది.

టీ20 రచ్చ.. జింఖానా మైదానంలో తొక్కిసలాట, ఒకరు మృతి
X

సికింద్రాబాద్ జింఖానా మైదానం వద్ద పరిస్థితి అదుపు తప్పింది. ఒక మహిళ చనిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈనెల 25న ఉప్పల్ స్డేడియంలో భారత్- ఆసీస్ మధ్య టీ20 మ్యాచ్ జరగనుంది. ఇందుకు టికెట్ల విక్రయానికి హెచ్‌సీఏ ఏర్పాటు చేసింది. టికెట్ల కోసం వేలాది మంది ఫ్యాన్స్ ఎగబడ్డారు. సికింద్రాబాద్ జింఖానా మైదానం వద్ద టికెట్ల విక్రయం మొదలవగా ఒక్కసారిగా వేలమంది అభిమానులు వచ్చేశారు.

వారిని నియంత్రించడం పోలీసులు వల్ల కూడా కాలేదు. ఒక దశలో లాఠీచార్జ్ చేశారు. అయినా పరిస్థితి అదుపుతప్పింది. తోక్కిసలాటలో 20 మంది వరకు స్పృహ కోల్పోయారు. తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందారు. ఆమెను రక్షించేందుకు పోలీసులు తక్షణమే స్పందించినా ఫలితం లేకపోయింది. ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారు ఆమె. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దీన్ని హెచ్‌సీఏ ఘోర వైఫల్యంగా అభివర్ణిస్తున్నారు. మ్యాచ్‌ జరిగే స్టేడియం కెపాసిటీ 55వేల సీట్లు అయినప్పటికీ.. ప్రస్తుతం మూడు వేల టికెట్లను మాత్రమే అమ్మకానికి పెట్టినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఆ మూడు వేల టికెట్ల కోసం వేల మంది ఒక్కసారిగా దూసుకొచ్చారు.



తొలుత పేటీఎం ద్వారా ఆన్‌లైన్‌లోనే టికెట్ల విక్రయమంటూ చెప్పిన హెచ్‌సీఏ ఆ తర్వాత ఆఫ్‌లైన్‌లోనూ విక్రయిస్తామని ప్రకటించింది. దాంతో నేడు వేల మంది తరలివచ్చారు. వేల మంది వస్తారని ఊహించలేకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిన్నట్టు భావిస్తున్నారు. టికెట్ల కొనుగోలు కోసం వచ్చిన వారి ఎంట్రీ,ఎగ్జిట్‌ రెండూ ఒకే చోట ఉండడం కూడా పరిస్థితి అదుపు తప్పడానికి కారణమైంది. ఉదయం నుంచే భారీగా అభిమానులు తరలి వచ్చినా సకాలంలో సరైన చర్యలు తీసుకోలేకపోయారన్న విమర్శలు వస్తున్నాయి.

First Published:  22 Sept 2022 12:51 PM IST
Next Story